భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తినాలా.. వద్దా?
- చికెన్ కు దూరంగా నాన్ వెజ్ ప్రియులు.. భారీగా పడిపోతున్న చికెన్ అమ్మకాలు
Bird Flu Effect Should I Eat Chicken |
ముక్కలేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది. ఈక్రమంలోనే చికెన్ తినాలా? వద్ద అన్న సందేహాలు ప్రతీఒక్కరిలో కలుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో నిన్నటి వరకు కొండెక్కిన చికెన్ రేటు నేలచూపులు చూస్తోంది. వారం ముందు వరకు కిలో చికెన్ రూ.220 ధర పలుకగా ప్రస్తుతం రూ.160కి పడిపోయింది.
బర్డ్ ఫూ భయం నేపథ్యంలో నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినేందుకు పెద్దగా ఇంట్రెస్టు చూపడం లేదు. దీంతో ఈ ధర మరింత పడిపోయే అవకాశాలు కన్పిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానంపల్లిలో సుమారు 2వేల కోళ్లు ఒకేరోజు మృతిచెందడంతో ఆ జిల్లాలో బర్డ్ ఫూ ఆందోళన నెలకొంది.
విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల కళేబరాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఆ రిజర్ట్ ఇంకా రాలేదు. మృతిచెందిన కోళ్లను సమీప అటవీ ప్రాంతంలో గుంతలుతీసి పూడ్చిపెట్టారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు గత రెండ్రోజులుగా బర్డ్ ఫ్లూపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నాన్ వెజ్ ప్రియులు చికెన్ కు దూరంగా ఉంటున్నారు. అయితే కోగుడ్లు.. చికెన్.. ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను సరైనరీతిలో ఉడికించి తీసుకుంటే ప్రమాదం ఉండదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించారు. ఈక్రమంలోనే రాష్ట్ర మంత్రులు చికెన్.. గుడ్లు తినవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు.
కేంద్ర సైతం ఇదే విషయాన్ని స్పష్ట చేస్తోంది. వైరస్‌ను క్రియారహితం చేయడానికి పౌల్ట్రీ ఉత్పత్తులను డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అరగంట సేపు ఉడికించాల్సి ఉంటుందని చెబుతోంది. అప్పుడే కోడిగుడ్లు.. చికెన్ సరిగా ఉడికి సురక్షితమైనవిగా మారతాయని పేర్కొంది.
చికెన్ విషయంలో శుభ్రత పాటించి.. సరైనవిధంగా వండుకుంటే ఎప్పటిలాగే పౌల్ట్రీ ఉత్పతులును తినొచ్చని చెబుతోంది. బర్డ్ ఫ్లూ బయటపడిన ప్రాంతాల్లోనూ చికెన్.. కోడిగుడ్లను సరైనరీతిలో ఉడికించి తింటే వైరస్ సంక్రమించదని కేంద్ర పశుసంవర్థక.. పాడిపరిశ్రమ శాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.
0 Comments