Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

‘కార్తీకదీపం’ రేటింగ్ పడిపోవడానికి అసలు కారణం ఇదేనట?

karthikadeepam trp

బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తున్న సీరియల్ ఏదైనా ఉందంటే అది ఒక్క ‘కార్తీక దీపం’ సీరియల్. వెయ్యికి పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నప్పటకీ నేటికి అత్యధిక ప్రజాధరణతో పొందుతూనే ఉంది. ఈ సీరియల్లో నటించే దీప(వంటలక్క).. డాక్టర్ బాబు.. మౌనిక క్యారెక్టర్లకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. 

దీప క్యారెక్టర్లో నటిస్తున్న కన్నడ కస్తూరి ప్రిమి విశ్వనాథ్ కైతే సెలబ్రెటీలు సైతం ఈర్యపడే అంతటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వంటలక్క హవా ముందు నాగార్జున హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్-4’, ‘ఐపీఎల్’ వంటి గేమ్ షోలు కూడా నిలువలేకపోయాయి. కార్తీక దీపం సీరియల్ వస్తున్న సమయంలో ఐపీఎల్ నిర్వహించొద్దంటూ అప్పట్లో ఫ్యాన్స్ బీసీసీఐకి లేఖలు రాయడం సంచలనం మారింది. 

అంతటీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన ‘కార్తీక దీపం’ సీరియల్ టీఆర్పీ క్రమంగా పడిపోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొంతకాలంగా అనేక ట్వీస్టుల మధ్య కొనసాగుతున్న ఈ సీరియల్ ఇటీవల చివరి దశకు చేరుకుందనే టాక్ విన్పించింది. దీనికి తగ్గట్టుగానే ఈ సీరియల్లో ప్రధాన పాత్రలైన డాక్టర్ బాబు.. వంటలక్కలు కలుసుకుంటారు. 

విడిపోయిన భార్యభర్తలు ఎప్పుడు కలుసుకుంటారనే నేపథ్యంలో ‘కార్తీకదీపం’ సీరియల్ ను డైరెక్టర్ తెరకెక్కించాడు. డాక్టర్ బాబు వంటలక్కను అనుమానించడంతో వీరిద్దరు విడిపోవడం కొన్నాళ్లుగా చూపిస్తున్నాయి. అయితే ఇటీవల డాక్టర్ బాబు అనుమానం తొలిగిపోవడంతో వీరద్దరు కలుస్తారు. 

అయితే మౌనిక ప్రగ్నెసీకి డాక్టర్ బాబే కారణమంటూ మరో ట్వీస్ట్ ఇస్తుంది. దీంతో ఈ సీరియల్ ఇప్పట్లో ముగింపు దశకు చేరుకోదని సగటు ప్రేక్షకుడికి అర్థమవుతోంది. డైరెక్టర్ కావాలనే సీరియల్ ను సాగదీస్తున్నాడని అర్థం చేసుకున్న ఓ వర్గం ప్రేక్షకులు చూడటం తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికితోడు టెలివిజన్లో సీరియల్ ప్రసారం కంటే ముందే హాట్ స్టార్లో యాప్ లో వీక్షకులు చూసేస్తున్నారట.

దీంతో గత వారం నుంచి కార్తీక దీపం సీరియల్ రేటింగ్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. 24వ వారంలో కార్తీక దీపం సీరియల్ అర్బన్ లో 17.28 ఉండగా రూరల్ లో 17.67గా ఉంది. 25వ వారానికి వచ్చేటప్పటికీ అర్బన్లో 16.99.. రూరల్లో 16.20 రేటింగ్ వచ్చింది. గత వారంతో పోలిస్తే ఈ వారం టీఆర్పీ తగ్గడం వెనుక సీరియల్ సాగదీతే ప్రధాన కారణమని తెలుస్తోంది. 

ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఇప్పటివరకు బుల్లితెరపై హవా చాటుతున్న ‘కార్తీక దీపం’ క్రమంగా ప్రభ కోల్పోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికైనా డైరెక్టర్ సీరియల్ ను సాగదీయకుండా శుభంకార్డు పలికేలా కథను నడిపించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. డైరెక్టర్ ఆ దిశగా ఆలోచిస్తాడా? లేదంటే కథను మరిన్ని మలుపులు తిప్పుతాడా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!


Post a Comment

0 Comments