ట్రంప్ మరో సంచలనం.. అమెరికాలో ఎమర్జెన్సీ విధింపు..!
- జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.
Donald Trump |
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నవంబర్ నెలలో అమెరికా కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సినా ఉంది. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీకి ట్రంప్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ట్రంప్ తన పరాజయాన్ని అంగీకరించకపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యమవుతోంది.
అమెరికా కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రస్తుతం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైడెన్ గెలుపును అంగీకరించని ట్రంప్ తాను పదవీలో నుంచి దిగిబోయేలోగా డెమొక్రాట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకునేందుకు తన అనుచరులతో దాడులకు సైతం దిగుతుండటంతో అమెరికాలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవలే ట్రంప్ మద్దతుదారులు పెద్దఎత్తున క్యాపిటల్ భవనంలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మృతిచెందాడటం అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలింది. అయితే ఇప్పటికే జోబైడెన్ ను కొత్త అధ్యక్షుడిగా గుర్తిస్తూ అమెరికా ఉభయసభలు నిర్ణయం తీసుకున్నాయి.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్.. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వీరిద్దరు ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఎఫ్ బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ విధించాలని వాషింగ్టన్ మేయర్ బౌసర్ సిఫార్సు మేరకు ట్రంప్ కు సూచించారు. ఆయన సలహా మేరకు ట్రంప్ వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారు. కాగా మరో ఎనిమిదిరోజుల్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను నుంచి తప్పుకోనున్నారు.
0 Comments