మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ‘చిట్టిబాబు’
- కరోనా నుంచి కోలుకున్నట్లు ట్వీటర్లో పోస్టు చేసిన రాంచరణ్
![]() |
Ramcharan Carona Negative Report |
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక.. క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీతో కలిసి మెగా పవర్ స్టార్ సందడి చేశారు. క్రిస్మస్ వేడుకల తర్వాత రాంచరణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో మెగా ఫ్యామిలీలో టెన్షన్ నెలకొంది.
రాంచరణ్ కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ఆ విషయాన్ని రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనతో కొద్దిరోజులుగా టచ్లో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించాడు.
ఈక్రమంలోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొద్దిరోజులుగా హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రాంచరణ్ భార్య ఉపాసన సైతం తనకు కూడా కరోనా రావచ్చనే ఇటీవల ట్వీట్ చేసింది.
రాంచరణ్ కు అన్ని పనులు ఆమె దగ్గరుండి చూసుకుండటంతోనే ఆ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే రాంచరణ్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రాంచరణ్ కొద్దిసేపటి క్రితమే తన ట్వీటర్లో పోస్టు చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాంచరణ్ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తుంది. ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనేది క్లారిటీ రావాల్సింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
It feels good to be back !!! pic.twitter.com/5yqXQkPVtg
— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2021
0 Comments