అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జోబైడైన్
- అమెరికన్ రెస్య్యూ ప్లాన్ పేరిట 1.9ట్రిలియన్ల డాలర్ల సాయం
Joe Biden Announces Bumper |
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరిగాయి. హోరాహోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ తరుఫున జో బైడెన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే జో బైడైన్ ఓట్లు పోలయ్యాయి.
ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకపోవడంతో అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యమవుతూ వస్తోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ట్రంప్ తన ఓటమిని అంగీకరించాడు. దీంతో కొత్త అధ్యక్షుడిగా జో బైడైన్.. ఉపాధ్యక్షురాలిగా ప్రవాస భారతీయురాలు కమలాహారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జో బైడైన్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరిక్లను బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. అమెరికాలో కరోనా నియంత్రణ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 1.9ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రణాళికను జో బైడైన్ ప్రకటించారు. కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ పంపిణీ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అమెరికన్ రెస్య్యూ ప్లాన్ పేరిట 1.9ట్రిలియన్ల డాలర్ల సాయాన్ని అమెరికన్లకు అందించనున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే 100మిలియన్ టీకాలు వేయడమే లక్ష్యంగా పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే మరో దఫా ఆర్థికసాయం ప్రకటించేందుకు సిద్ధమని జోబైడైన్ స్పష్టం చేశారు.
0 Comments