రాయల్ లుక్కులో అదరగొట్టిన హిమాలయన్ బైక్
- జిగేల్ మంటున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ధర
- భారత్.. యూరోపియన్ మార్కెట్లోకి ఒకేసారి లాంచ్ చేసిన కంపెనీ
ప్రముఖ ఆటో దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ సరికొత్త మోడల్ ను విడుదల చేసింది. రాయల్ కంపెనీకి చెందిన బైకులన్నీ అదిరిపోయే లుక్కుతో ఆకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులన్నీ కూడా అదిరిపోయే ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి అడ్వెంచర్ టూరింగ్ మోటర్ సైకిల్ హిమాలయన్లో సరికొత్త వెర్షన్ ను కంపెనీ లాంచ్ చేసింది.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్ ను భారత్ తోపాటు యూరోపియన్ మార్కెట్లోకి ఒకేసారి ఆ కంపెనీ విడుదల చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ వెర్షన్లో సౌకర్యాల పరంగా పలు మార్పులను చేసి హిమాలయన్ బైక్ ను సరికొత్తగా డిజైన్ చేశారు. గ్రానైట్ బ్లాక్.. మిరాజ్ సిల్వర్.. పైన్ గ్రీన్ కలర్స్ లో ఈ బైక్ లభ్యం కానుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ బైక్ ను కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కంపెనీ డిజైన్ చేసినట్లు కన్పిస్తోంది. ఇందులో మెరుగైన కుషనింగ్.. అదనపు ప్లేట్ తో వెనుక క్యారియర్.. ఎర్గోనామిక్ ఫ్రంట్ ర్యాక్.. విండ్ స్కీన్ వంటి అదనపు ఆకర్షణలున్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హిమలయన్ బైక్ ధర(ఢిల్లీ ఎక్స్ షోరూం) రూ.2.01లక్షలుగా ఉంది.
రెండు లక్షలకు పైగా ధరతో వచ్చిన భారత మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ జిగేల్ మనే లుక్కుతో ఆకట్టుకుంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని బైక్ ప్రియులు మాత్రం దీనిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ అడ్వంచర్ బైక్ ను ‘మేక్ ఇట్ యువర్స్’ ఫ్టాట్ ఫాంలోనూ కంపెనీ అందుబాటులో ఉంచింది.
0 Comments