కేజీఎఫ్-2 రిలీజ్ డేట్.. మోదీని ఇరుకున పెట్టిన అభిమాని..!
- జూలై 16న సెలవు ప్రకటించాలని ప్రధాని లేఖరాసిన యష్ అభిమాని
National Holiday on KGF-2 release day |
కేజీఎఫ్ మూవీ కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. కేజీఎఫ్ కు సిక్వెల్ గా కేజీఎఫ్-2 రాబోతుంది. జనవరి 8న కన్నడ రాక్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ ట్రైలర్ ను కేజీఎఫ్ చిత్రయూనిట్ విడుదల చేయడంతోపాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
కేజీఎఫ్-2 మూవీని జూలై 16న విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిలింస్ ప్రకటించింది. కేజీఎఫ్-2 మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా హోంబలే ఫిలింస్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. రవి బాస్రుర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.
కేజీఎఫ్-2 జనవరి 8న విడుదలైన యూట్యూబ్లో వరల్డ్ రికార్డు సృష్టించింది. ఫాసెస్ట్ వన్ మిలియన్ దక్కుంచుకున్న తొలి ట్రైలర్ గా కేజీఎఫ్-2 నిలిచింది. దీంతోపాటు పలురికార్డులను కేజీఎఫ్-2 ట్రైలర్ నమోదు చేసుకొంది. జనవరి 8న విడుదలైన కేజీఎఫ్-2 ట్రైలర్ నేటి వరకు(ఫిబ్రవరి 1) 16కోట్ల47లక్షల29వేల200 వ్యూస్ ను సంపాదించుకుంది.
కేజీఎఫ్-2 ట్రైలర్లో యష్ యాక్షన్ కు అభిమానులంతా ఫిదా అయిపోయారు. 'పవర్ పుల్ పీపుల్ పవర్ ఫుల్ ప్లేషెస్ నుంచి వస్తారని చరిత్ర చెబుతోంది..’ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన డైలాగ్ అభిమానులను సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ మూవీలో యష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది.
కేజీఎఫ్-2 బాలీవుడ్ నటుడు సంజయ్.. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్.. సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్.. రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. జూలై 16న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో ఇప్పటికే నుంచి సోషల్ మీడియాలో అభిమానుల హంగామా మొదలైంది.
కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ జూలై 16న దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని ఓ అభిమాని ఏకంగా ప్రధాని మోదీని ట్వీటర్లో కోరాడు. కేజీఎఫ్ ఫ్యాన్స్ ఎమోషన్స్ ను దృష్టిలో ఉంచుకొని జూలై 16న సెలవుదినంగా ప్రకటించాలని సదరు అభిమాని కోరాడు. కేజీఎఫ్-2 మూవీ జూలై 16న(శుక్రవారం) విడుదల కానుంది.
మరో రెండ్రోజుల్లో ఆదివారం(సెలవుదినం) రానుంది. దీంతో ఆరోజు కేజీఎఫ్-2 రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్-2 అభిమాని ట్వీట్ పై మోదీ స్పందిస్తారా? లేదా అన్నది మాత్రం ఆసక్తిని రేపుతోంది. ఏదిఏమైనా ఒక సినిమా విడుదల రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని ప్రధాని కోరడం మాత్రం కొంత అతిశయోక్తిగానే కన్పిస్తోంది.
0 Comments