Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Acharya teaser that crossed millions of views

ఆచార్య కటౌట్ కు మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ అదుర్స్..!

  • 67సెకన్ల టీజర్లోనే సినిమా ఎలా ఉంటుందో చూపించిన కోరటాల
  • బాస్ తో పెట్టుకుంటే గుణపాఠం తప్పదంటున్న మెగా అభిమానులు

acharya, acharya Teaser, mega star, mega star chiranjeevi movies, chiru, acharya telugu movie, acharya teaser announcement
Acharya teaser

మెగా అభిమానులు కొద్దిరోజులుగా ఆచార్య టీజర్ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆచార్య టీజర్ విడుదలై ట్రెండింగులోకి తీసుకెళుతుంది. కేవలం అరగంటలోనే లక్షకు పైగా లైకులు 2మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

మెగాస్టార్ చిరంజీవి.. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. వీరిద్దరి కాంబినేషన్ పై మెగా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మెగా అభిమానులను అలరించేలా కోరటాల శివ సినిమాను తీర్చిదిదినట్లు కన్పిస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అనేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే కోరటాల శివ ప్రకటించారు. 

తాజాగా విడుదలైన టీజర్ చూస్తే కోరటాల శివ చెప్పినట్లుగానే ఆచార్య మూవీ ఉండబోతుందని స్పష్టమవుతోంది. కేవలం 67నిడివితో విడుదలైన ఆచార్య టీజర్ తోనే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాడు దర్శకుడు కొరటాల. ఆచార్య టీజర్ కు మెగా పవర్ స్టార్ రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 

మెగా పవర్ స్టార్ వాయిస్ లో 'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు..' అంటూ టీజర్ ప్రారంభమమవడం ఆకట్టుకుంది. ఈక్రమంలోనే ధర్మస్థలిలో ఆచార్యగా చిరంజీవి అడుగుపెట్టడం.. వారికోసం పోరాడటం వంటి సన్నివేశాలను చూపించారు.

'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో 'ఆచార్య' అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..'నని చిరంజీవి తన స్టైల్లో చెప్పడం ఆకట్టుకుంది. కమర్షియల్ సినిమాలను మెసేజ్ ఓరియేంటెడ్ గా చూపించే కొరటాల ఆచార్యను కూడా అదే తరహాలో చూపించబోతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. 

ఆచార్య టీజర్ చివర్లో 'ఆచార్య దేవో భవ.. ఆచార్య రక్షో భవ' అంటూ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఆచార్య మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ కిచ్లు నటిస్తుంది. సిద్ధగా నటిస్తున్న రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ తిరు.. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ కలిసి అందించిన విజువల్స్ అద్భుతంగా నిలిచాయి. 

ఆచార్య మూవీకి ఎడిటింగ్ వర్క్ నవీన్ నూలి చేయగా స్టంట్ మాస్టర్లుగా రామ్-లక్ష్మణ్ పని చేశారు. నేడు విడుదలైన ఆచార్య అభిమానులను మాత్రం ఫుల్ ఖుషీ చేసింది. ఆచార్య జోష్ చూస్తుంటే యూట్యూబ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ మూవీని ఆచార్య టీమ్ సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Post a Comment

0 Comments