మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ చౌక ప్లాన్..!
- కేవలం రూ.89కే మొబైల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు
Amazon Monthly plans |
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మొబైల్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.89కే అమెజాన్ ప్రైమ్ వీడియోలను మొబైల్ యూజర్లు వీక్షించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లాన్ ఇదే కావడం విశేషం. నెలకు రూ.89 ప్లాన్ తొలుత భారతీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఒక్క యూజర్ కు మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్లో హై డెఫినిషన్ నాణ్యత ప్రసారాలను అమెజాన్ ప్రైమ్ అందించ నుంది. 30రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6జీబీ డేటాతో 28రోజుల వ్యాలిడీతో రూ.89 ప్లాన్ ను మొబైల్ యూజర్లు ఎంచుకోవచ్చని అమెజాన్ ప్రైమ్ పేర్కొంది.
ఒక్క యూజర్ కంటే ఎక్కువ మంది యూజర్లు అమెజాన్ వీడియోలను వీక్షించాలనుకుంటే, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్ డాట్ సర్వీస్ డెలివరీ సర్వీసుల కోసం 30రోజుల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రూ.131తో తీసుకోవాల్సి ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ ప్రస్తుతం నెలకు రూ.129.. వార్షిక రూ.999ల ఆఫర్లు యథావిధంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పలు రీచార్జ్ పాయింట్లతోపాటు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్స్ ద్వారా ఈ ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు.
ఓటీటీ మార్కెట్లో పట్టుకోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. జీ5, నెట్ ఫిక్స్ సంస్థలతో పోటీ పడుతోంది. కాగా గతేడాది నెట్ ఫిక్స్ మొబైల్ యూజర్ల కోసం రూ.199 ప్లాన్ తీసుకొచ్చింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ నెలకు రూ.89కే ప్లాన్ తీసుకొచ్చింది.
0 Comments