వకీల్ సాబ్ టీజర్ కు ఎన్టీఆర్.. ఎఎన్ఆర్ విజిల్స్.!
- థమన్ మ్యూజిక్ కు ఫన్నీ టచ్ ఇచ్చిన నెటిజన్.. నెట్టింట్లో సూపర్ రెస్పాన్స్
NTR AND ANR |
బాలీవుడ్లో బిగ్ బీ అమితాబ్ నటించిన ‘పింక్’ ను తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. పవన్ స్టామీనాకు తగ్గట్టుగా పింక్ మూవీలో పలుమార్పలు చేర్పులు చేసి వకీల్ సాబ్ గా తెరకెక్కించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలన్నీ ఇటీవలీ కాలంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలుస్తోంది. థమన్ కాపీ మ్యూజిక్ చేస్తాడనే విమర్శలు ఉన్నప్పటికీ సినీ ప్రియుల్లో ఆయన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదిలా ఉంటే థమన్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
వకీల్ సాబ్ మూవీలోని సాంగ్స్ కు ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ చిత్రయూనిట్ జనవరి 14 సాయంత్రం 6.03 నిమిషాలకు టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ విడుదలైన అరగంటలోనే ఒక మిలియన్.. గంటలో రెండు మిలియన్లు వ్యూస్ సాధించిన పవర్ స్టార్ స్టామీనాను మరోసారి నిరూపించింది.
వకీల్ సాబ్ టీజర్ ఇప్పటికే 8మిలియన్ల వ్యూస్ సాధించి ఏడు లక్షల లైక్స్ దక్కించుకుంది. అతి తక్కువ సమయంలో మిలియన్ వ్యూస్ దక్కించుకున్న రెండో సినిమాగా వకీల్ సాబ్ నిలిచింది. మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉంది. అయితే లైక్స్ విషయంలో మాత్రం వకీల్ సాబ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
వకీల్ సాబ్ టీజర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తుండగా ఓ నెటిజన్ థమన్ సంగీతానికి ఫన్నీ టచ్ ఇచ్చాడు. స్వర్గీయ ఎన్టీఆర్.. ఎఎన్ఆర్ లు వకీల్ సాబ్ మ్యూజిక్ కు ఈలలు వేస్తున్నట్లు చూపించాడు. ఎఎన్ఆర్ తొలుత వకీల్ సాబ్ టీజర్ మ్యూజిక్ కు విజిల్స్ వేయగా ఆ వెంటనే ఎన్టీఆర్ సైతం ఈలలు వేయడం ప్రతీఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోకు థమన్ సైతం లైక్ కొట్టి తన అభినందన తెలియజేశాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వకీల్ సాబ్ లో పవన్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా అంజలి.. అన్యన్య పాండే.. నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Here it is... Edo try chesa...
— Mr Solo (@SolidLover123) January 15, 2021
#VakeelSaabTEASER Whistle ft #NTR #ANR 😀😀 #UnbeatableBheemTeaser #KomaramBheemNTR #RRRMovie @tarak9999 pic.twitter.com/QbrBEwqbIf
0 Comments