లాభాలు ఆర్జించిన ఏషియన్ పెయింట్స్..!
- మూడో త్రైమాసికంలో రూ.1265కోట్ల లాభాలను ఆర్జించిన ఏషియన్ పెయింట్స్
Asian Paints |
గతేడాది కరోనా ఎంట్రీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా దాటికి అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే పలు రంగాలు తిరిగి కోలుకుంటున్నాయి. అయితే బ్లూచిప్ కంపెనీకి చెందిన ఏషియన్ పెయింట్స్ మాత్రం కరోనా క్రైసిస్ ను తట్టుకొని మరీ లాభాలను గడించి సరికొత్త రికార్డును సృష్టించింది.
ఏషియన్స్ పెయింట్స్ గతేడాది క్యూ3(అక్టోబర్ నుంచి డిసెంబర్)తో పోలిస్తే ఈసారి 62శాతం అధికంగా లాభాలను గడించింది. 2020-21 క్యూ3లో ఏషియన్స్ పెయింట్స్ కు రూ.1265కోట్ల ఆదాయం దక్కింది. కన్సాలిడేటేడ్ ప్రతిపాదికన ఈ ఏడాది మొత్తంగా నికర ఆదాయం 25శాతం పెంచుకొని రూ.6886కోట్లను కంపెనీ అధిగమించింది.
ఏషియన్ పెయింట్స్ కు గడించిన లాభాలను ఆ సంస్థ ఎండీ.. సీఈవో అమిత్ సింగ్లే తాజాగా వెల్లడించారు. వివిధ బిజినెస్ విభాగాల్లో ఏషియన్ పెయింట్స్ కు మంచి డిమాండ్ ఉందని అమిత్ సింగ్లే పేర్కొన్నారు. దేశియంగానూ డెకొరేటివ్ బిజినెస్ విభాగాల్లో ఏషియన్ పెయింట్స్ 30శాతం వృద్ధి సాధించినట్లు ఆయన వెల్లడించారు.
ఏషియన్ పెయింట్స్ క్యూ3 ఫలితాల వెల్లడి తర్వాత ఆ కంపెనీ షేరు 0.6శాతం అధికంగా బలపడి రూ.2715 వద్ద ముగింది. కరోనా కాలంలోనూ ఏషియన్ పెయింట్స్ లాభాలు గడించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏషియన్స్ పెయింట్స్ మరిన్ని లాభాలు గడించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
0 Comments