నెట్ ఫిక్స్ లో గర్జిస్తున్న ‘ది వైట్ టైగర్’ మూవీ
- అరవింద్ అడిగా నవలా ఆధారంగా తెరకెక్కిన ది వైట్ టైగర్
ది వైట్ టైగర్-The White Tiger |
ప్రముఖ ఓటీటీ నెట్ ఫిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 190దేశాల్లో 195మిలియన్లకు పైగా సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. వీరంతా నెట్ ఫిక్స్ లో సినిమాలు.. వెబ్ సిరీస్.. ప్రత్యేక షోలను తిలకిస్తుంటారు. తన వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన సినిమాలను నెట్ ఫిక్స్ అందిస్తోంది. దీనిలో భాగంగానే నేడు(జనవరి 22న) ‘ది వైట్ టైగ్’ మూవీని నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ చేసింది.
మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా నవలా ఆధారంగా ది వైట్ టైగర్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీని ఇరానియన్-అమెరికన్ రామిన్ బ్రహ్మానీ.. ముకుల్ డియోరాలు నిర్మించారు. ది వైట్ టైగర్ మూవీని రామిన్ బ్రహ్మాని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. హిందీ, ఇ
ది వైట్ టైగర్ మూవీ ప్రియాంక చోప్రా.. రాజ్ కుమ్మార్ రావు. ఆదర్శ్ గౌరవ్.. మహేష్ మంజ్రేకర్.. తదితరుల చుట్టూనే తిరుగుతోంది. పింకీ మేడమ్ పాత్రలో ప్రియాంక చోప్రా.. అశోక్ పాత్రలో రాజ్ కుమ్మార్ రావు.. డ్రైవర్ బలరాం పాత్రలో ఆదర్శ్ గౌరవ్ అద్భుతంగా నటించారు. 125నిమిషాల నిడివితో తెరకెక్కిన ‘ది వైట్ టైగర్’ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
పేదరికంలో పుట్టిపెరిగిన డ్రైవర్ బలరాం ధనవంతులైన దంపతులు పింకీ మేడర్.. అశోక్ లకు డ్రైవర్ గా పని చేస్తాడు. ధనవంతుల జీవితాల్లో జల్సాలను గమనించే బలరాం తన పేదరికం నుంచి తప్పించుకొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడనేది దర్శకుడు ఆద్యంతం చాలా చక్కగా చూపించాడు. ప్రస్తుతం ది వైట్ టైగర్ మూవీ నెట్ ఫిక్స్ లో గర్జిస్తుందంటూ ఆ సంస్థ తాాజాగా ట్వీట్ చేసింది.
0 Comments