72వ గణతంత్ర వేడుకల సందర్భంగా ‘మెగా’ రక్తదానం
- రక్తదానం చేయండి.. ప్రాణదాతలుకండి అంటూ మెగాస్టార్ పిలుపు
Mega Star Chiranjeevi Twitter |
కరోనా పాండమిక్ పీరియడ్లో ప్రతీఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. సైంటిస్టుకు కరోనాకు వ్యాక్సిన్ రావడంతో అన్నిరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా కాలంలో లాక్డౌన్ విధించడంతో రక్తదాతలు ఇంటికి పరిమితం కావడంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కోరత ఏర్పడిన సంగతి తెల్సిందే.
లాక్డౌన్ తర్వాత కరోనా భయంతో చాలామంది రక్తదానం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో రక్తం అవసరం ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పలుసార్లు అభిమానులు.. రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు పలువురు ముందుకొచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఇదేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సైతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేకరిస్తూ అవసరమైన వారికి అందిస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.
మెగా అభిమానులు.. రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని చిరంజీవి కోరారు. ఈమేరకు తన సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. తన పిలుపుకు స్పందించి ఇప్పటికే రక్తదానం చేసిన.. రక్తదానం చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో రక్తదాతలు పాల్గొని ప్రాణదాతలుగా నిలువాలని కోరారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2021
Also Read: ‘ఆచార్య’ షేర్ చేసిన అద్భుతమైన టెంపుల్.. ఓ లుక్కేయండి..!
0 Comments