క్రాక్ నుంచి ఖిలాడిగా మారిన రవితేజ
- గణతంత్ర దినోత్సవం.. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా కిలాడి ఫస్టు గ్లిమ్స్ రిలీజ్
Ravi Teja Khiladi Movie First Glimpse |
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల క్రాక్ మూవీతో బిగ్గెస్ట్ హిట్టందుకున్నాడు. లాక్డౌన్ తర్వాత వచ్చిన మూవీలన్నింటిలో ఇప్పటివరకు క్రాక్ మూవీని అత్యధిక కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. క్రాక్ మూవీ థియేటర్ల గొడవ పక్కన పెడితే ఈ మూవీ రవితేజతోపాటు అతడి ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.
క్రాక్ మూవీ విజయం తర్వాత రవితేజ కిలాడిగా మారిపోయారు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు గణతంత్ర దినోత్సవం.. రవితేజ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్రయూనిట్ ఖిలాడి ఫస్టు గ్లిమ్స్ ను విడుదల చేసింది.
37సెకన్ల నిడివితో విడుదలైన ఖిలాడి ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయింది. ఇందులో రవితేజ ఓ హ్యమర్ పట్టుకొని రౌడీలను వేటాడుతున్నట్లు చూపించారు. ఈ వీడియోలో అల్ట్రా స్టైయిల్ లుక్కులో రవితేజ కన్పించాడు. బ్యాక్ డ్రాప్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదరగొట్టాడు. ఖిలాడి ఫస్ట్ గ్లిమ్స్ తోనే సినిమాలో యాక్షన్ ఏమేరకు ఉంటుందో ఓ రేంజ్లో దర్శకుడు రమేష్ వర్మ చూపించాడు.
రవితేజ ఖిలాడీ మూవీని పెన్ స్టూడియో అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్లో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్లో యాక్షన్ ఎంటటైనర్ గా ఖిలాడి మూవీని తీర్చిదిద్దతున్నారు. ఈ మూవీకి రామ్.. లక్ష్మణ్.. అన్బు.. అరివులు ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీమణి సాహిత్యం.. సినిమాటోగ్రఫీ సుజిత్ వాసు దేవ్.. శ్రీకాంత్ విస్సా.. సాగర్ లు డైలాగ్స్.. అమర్ రెడ్డిలు ఎడిటింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఖిలాడి మూవీని ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.
0 Comments