Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

PittaKathalu Official Teaser Goes Trending

 నెట్ ఫిక్స్ ‘పిట్టలు కథలు’ విభిన్న తరహాలో..!

  • స్వతంత్య్ర భావాలు కలిగిన నలుగురు మహిళల కథాంశంతో తెరకెక్కిన పిట్టకథలు.

Pitta Kathalu Official Teaser, Shruti Haasan, Eesha Rebba, Amala Paul, Lakshmi Manchu, Saanve Megghana, Pitta Kathalu
Pitta Kathalu Official Tea serTrending

ప్రముఖ ఓటీటీ నెట్ ఫిక్స్ తెలుగులో విభిన్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. కొత్త సినిమాలు.. వెబ్ సిరీసులు.. ప్రత్యేక షోలతో నెట్ ఫిక్స్ ఇండియా సంస్థ సినీప్రియులను ఆకట్టుకుంటోంది. తెలుగులో పిట్టకథలు అనే పేరుతో మొట్టమొదటి ఆంథాలజీ సిరీస్ కు నెట్ ఫిక్స్ శ్రీకారం చుట్టింది. 

పిట్టకథలు మూవీని నాలుగు భాగాలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు భాగాలను నలుగురు అత్త్యుత్తమ దర్శకులు తెరకెక్కించారు. స్వతంత్ర్య భావాలు కలిగిన నలుగురు మహిళల కథాంశాన్ని నెట్ ఫిక్స్ మసాలా జోడించి పిట్టలకథల సంకలాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. 

నలుగురు మహిళల కథలను పిట్టకథలుగా నెట్ ఫిక్స్ ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. శృతిహాసన్.. ఈషారెబ్బా.. లక్ష్మీ మంచు.. అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే జగపతిబాబు.. సత్యదేవ్.. అషిమా నర్వాల్.. సాన్వే మేఘనా.. సంజిత్ హెగ్డే ముఖ్య పాత్రల్లో నటించారు. 

పిట్టకథలు సిరీసుకు సంబంధించిన టీజర్ ను నెట్ ఫిక్స్ తాజాగా విడుదల చేసింది. నాలుగు భాగాల్లో తెరకెక్కిన పిట్టలకథలకు తరుణ్ భాస్కర్.. నందిని రెడ్డి.. నాగ్ అశ్విన్.. సంజల్ప్ రెడ్డిలు తెరకెక్కించారు. ఈ టీజర్ చూస్తుంటే పిట్టకథలను దర్శకులు బోల్డ్ గా చర్చించినట్లు గా కన్పిస్తుంది. 

హిందీ తెరకెక్కిన ‘లస్ట్ స్టోరీస్’ తరహాలో పిట్టకథలు ఉండనుందనే టాక్ విన్పిస్తోంది. పిట్టకథల సిరీసును ఆర్ఎస్వీపీ మూవీస్.. ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 19న 190దేశాల్లో పిట్టకథలు స్ట్రీమింగ్ కానున్నట్లు టీజర్లో నెట్ ఫిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 

Post a Comment

0 Comments