అలర్ట్.. అలర్ట్.. ఇంటర్మీయట్ పరీక్ష తేదిలు వచ్చేశాయ్..!
- ఏప్రిల్ లో ప్రాక్టికల్స్.. మే 1 నుంచి థియరీ పరీక్షలు
- ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన టీఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana Intermediate Exam Schedule Released |
తెలంగాణలో ఇంటర్మీయట్ పరీక్షల తేదిలు వచ్చేశాయ్. కరోనా క్రైసిస్ తో విద్యారంగం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. రెగ్యూలర్.. ఆన్ లైన్ క్లాస్ పేరిట క్లాసులు నిర్వహిస్తూ ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని గాడినపట్టే ప్రయత్నాన్ని తెలంగాణ విద్యాశాఖ చేస్తోంది. ఈక్రమంలోనే ఇంటర్మీయట్ పరీక్షల తేదిల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు మే 1 తేదిన ప్రారంభమై మే 19తో ముగియనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మే 2తేదిన ప్రారంభమై మే 20తో ముగియనున్నాయి. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పేపర్.. ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్.. ఏప్రిల్ 7న 20వరకు ఇంటర్మీయట్ ప్రాక్టీకల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే సమయంలో ఇంటర్మీయట్ బోర్డు పరీక్షలు నిర్వహించనుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీయట్ బోర్డు టైం టేబుల్ ను ఖరారు చేసింది. ఇంటర్మీయట్ పరీక్షలు తేదిలు రావడంతో విద్యార్థులంతా అలర్ట్ అవుతున్నారు. మరోసారి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు.
ఇంటర్మీయట్ ఫస్టు ఇయర్ పరీక్ష షెడ్యూల్..
- మే 1న పార్ట్-2: సెకండ్ లాంగ్వేజ్ ఫస్టు పేపర్
- మే 3న పార్ట్-1: ఇంగ్లీష్ ఫస్టు పేపర్
- మే 5న పార్ట్-3: మాథమెటిక్స్ పేపర్-1ఏ.. బోటనీ.. సివిక్స్.. సైకాలజీ ఫస్టు పేపర్స్
- మే 7న మ్యాథమెటిక్స్ పేపర్-1బీ.. జువాలజీ.. హిస్టరీ ఫస్టు పేపర్స్
- మే 10న ఫిజిక్స్.. ఎకనామిక్స్.. క్లాసికల్ లాంగ్వేజ్ ఫస్టు పేపర్స్
- మే 12న కెమిస్ట్రీ.. కామర్స్.. సోషియాలజీ.. ఫైన్స్ ఆర్ట్స్.. మ్యూజిక్ ఫస్టు పేపర్స్
- మే 17న జియోలజీ.. హోం సైన్స్.. పబ్లిక్ అడ్మినిస్టేషన్.. లాజిక్ ఫస్టు పేపర్స్.. బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ ఫస్టు పేపర్(ఫర్ బైపీసీ స్టూడెంట్స్)
- మే 19న మోడర్న్ లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్.. జియోగ్రఫీ ఫస్టు పేపర్
ఇంటర్మీయట్ సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్..
- మే 2న పార్ట్-2: సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్
- మే4న పార్ట్-1: ఇంగ్లీష్ సెకండ్ పేపర్
- మే6న పార్ట్-3: మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ..బోటనీ.. సివిక్స్.. సైకాలజీ సెకండ్ పేపర్స్
- మే 8న మ్యాథమెటిక్స్ పేపర్-2బీ.. జువాలజీ.. హిస్టరీ సెకండ్ పేపర్స్
- మే 11న ఫిజిక్స్.. ఎకనామిక్స్.. క్లాసికల్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్స్
- మే 13న కెమిస్ట్రీ.. కామర్స్.. సోషియాలజీ.. ఫైన్స్ ఆర్ట్స్.. మ్యూజిక్ సెకండ్ పేపర్స్
- మే 18న జియోలజీ.. హోం సైన్స్.. పబ్లిక్ అడ్మినిస్టేషన్.. లాజిక్ సెకండ్ పేపర్స్.. బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ సెకండ్ పేపర్(ఫర్ బైపీసీ స్టూడెంట్స్)
- మే 20న మోడర్న్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్.. జియోగ్రఫీ సెకండ్ పేపర్.
0 Comments