గ్రామీణ డాక్ సేవక్ లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఏపీలో 2229.. తెలంగాణలో 1150.. ఢిల్లీలో 233 ఖాళీలు
Postal Jobs |
ఇండియన్ పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్.. తెలంగాణతోపాటు ఢిల్లీలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇండియన్ పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది.
గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్టుమాస్టర్(బీపీఎం).. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పదో తరగతిలో మ‌్యాథమేటిక్స్.. లోకల్ లాంగ్వేజ్.. ఇంగ్లీష్ సబ్జెక్టు్లతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60రోజుల శిక్షణా వ్యవధితో ఉన్న ఏదైనా కంప్యూటర్ సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్‌ను ఒక సబ్జెక్టుగా పదోతరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదు.
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి పరీక్ష ఉండదు. ఆన్ లైన్లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం 18నుంచి 40ఏళ్ల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ.. ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
బ్రాంచ్ పోస్టుమాస్టర్(బీపీఎం)కు 12వేల వేతనం.. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం)కు 10వేల వేతనంతోపాటు అలవెన్సులు ఉంటాయి. దరఖాస్తు కోసం జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ.. ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు.
ఆంధ్రప్రదేశ్ లో 2229.. తెలంగాణ 1150.. ఢిల్లీలో 233 ఉద్యోగాలకు ఆన్ లైన్ తేదిలు జనవరి 28నుంచే ప్రారంభమయ్యాయి. చివరి తేది ఫిబ్రవరి 26తేదిగా నిర్ణయించారు.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. INDIA POST
0 Comments