అమెరికాలో మరో కొత్త రాష్ట్రం..!
- 51వ రాష్ట్రంగా ఆవిర్భావించనున్న వాషింగ్టన్ డీసీ
వాషింగ్టన్ డీసీ Washington DC |
అమెరికాలో ప్రస్తుతం 50 రాష్ట్రాలున్నాయి. వాషింగ్టన్ డీసీ అమెరికా రాజధానిగా.. ప్రపంచ ఆర్థిక రాజధానికి డీసీ కొనసాగుతోంది. ప్రపంచ బ్యాంక్ సైతం వాషింగ్టన్ డీసీలోనే ఉంది. ఈ నగరంలో ఏడు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఈప్రాంతవాసులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవడంతో మరోసారి వాషింగ్టన్ డీసీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించేందుకు అధికారంలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ మద్దతు ఇస్తుండగా రిపబ్లిక్ పార్టీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే వాషింగ్టన్ డీసీని 51వ రాష్ట్రంగా మార్చాలని సెనేటర్ టామ్ కార్పర్ సెనేట్లో తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు.
ఎస్-51 పేరిట వాషింగ్టన్ డీసీ ప్రత్యేక రాష్ట్ర హోదా బిల్లును సెనేట్లో పెట్టారు. ఎస్-51 బిల్లు ఆమోదం పొందితే వాషింగ్టన్ డీసీ ప్రత్యేక రాష్ట్రంగా మారనుంది. డెమొక్రాటిక్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని నగరవాసులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో ఉన్న 50రాష్ట్రాలకు తోడుగా మరో రాష్ట్రం అవతరించడం ఖాయమనే టాక్ అమెరికాలో బలంగా విన్పిస్తోంది.
Also Read: అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జోబైడైన్
0 Comments