Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Gold Silver rates today trends

 ఫిబ్రవరి 2న బంగారం.. వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

  • భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలు

Gold rates, Silver rates, gold today, sliver today, gold sliver trends, gold rates india, gold rates hyderbad, బంగారం వెండి ధరలు
ఫిబ్రవరి 2న బంగారం వెండి ధరలు

బంగారు.. వెండి వస్తువులను చాలామంది ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడిగానూ చూస్తుంటారు. బంగారం.. వెండి ధరలు ప్రపంచ మార్కెట్ ఆధారంగా పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. భారత్ లో ఆడవాళ్లు బంగారాన్ని కేవలం అలంకారంప్రాయంగా చూస్తుంటారు.

బంగారంపై మహిళలకు ఉన్న మక్కువే భారత్ ఆర్థిక వ్యవస్థను చాలాసార్లు కాపాడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన సమయంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటానికి భారత్ లోని బంగారం నిల్వలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బంగారాన్ని అత్యధికంగా వినియోగించే.. కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలుస్తూ ఉంటుంది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉండటంతో ఒకరోజు తగ్గితే మరోరోజు భారీగా పెరగడం కన్పిస్తూ ఉంటుంది. 

బంగారం ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనుగోలు చేయాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజు బంగారం.. వెండి ధరలను పాఠకులకు కోసం అందించే ప్రయత్నం Useintrend చేస్తోంది. 

ఫిబ్రవరి 2న బంగారం.. వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఈరోజు భారత మార్కెట్ తోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 1తో పోలిస్తే ఫిబ్రవరి 2న బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. ఇండియా మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు నిన్న రూ.45వేల820 ఉండగా ఫిబ్రవరి 2న(నేడు) ఆ ధర రూ.45వేల150కి చేరింది. నిన్నటితో పోలిస్తే 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.350 తగ్గింది.  

24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు నిన్న రూ.49వేల640 ఉండగా ఫిబ్రవరి 2న(నేడు) ఆ ధర రూ.49వేల260కి చేరింది. 22క్యారెట్ల బంగారం మాదిరిగానే 24క్యారెట్ల బంగారం ధర కొంతమేర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 10గ్రాములకు రూ.380రూపాయల ధర తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.45వేల150 ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ.49వేల 260గా ఉంది. విజయవాడలో 22క్యారెట్ల బంగారం ధర రూ.45వేల150 ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ.45వేల260.. విశాఖపట్టణంలో సైతం 22క్యారెట్ల బంగారం రూ.45వేల150.. 24క్యారెట్ల బంగారం ధర రూ.45వేల260గా ఉంది. నిన్నటితో పోలిస్తే 22క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.350 తగ్గగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది.   

వెండి ధరలు..

ఫిబ్రవరి 2న ఇండియాలో వెండి ధర 10గ్రాములు రూ.740 ఉండగా వంద గ్రాములు రూ.7వేల400గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు వెండి ధరలు 10గ్రాములకు రూ.52తగ్గింది. హైదరాబాద్ పది గ్రాముల వెండి ధర రూ.740 ఉండగా విజయవాడ.. విశాఖపట్నంలోనూ వెండి ధర 10గ్రాములు రూ.768గా ఉంది. 

Post a Comment

0 Comments