కేరళలోని టెక్కడి అందాలు చూడవయా..!

  • టెక్కడిలోనే హంసనందిని బర్త్ డే సెలబ్రేషన్స్

kerala tourism, kerala places, hamsa nandini, hamsa, hamsa vlogs, hamsa travel, hamsa kerala, munnar, munnar vlogs, munnar resorts, munnar hotels, waterfalls, kerala waterfalls, hamsa videos, hamsa nandini videos
హంసనందిని(twitter/Hamsa Nandini)

హీరోయిన్ హంస నందిని కొద్దిరోజులుగా కేరళలో ట్రావెల్ వీడియోలను చేస్తోంది. ట్రావెల్ వ్లాగ్ ఆధ్వర్యంలో కేరళ డైరీస్ పేరిట హంసనందిని కేరళలో రోడ్ ట్రిప్ చేస్తోంది. ఇటీవలే కేరళలో మున్నార్ ఫారెస్టులో హంసనందిని పర్యటించి అక్కడి అందాలను వీడియోలో బంధించింది. మున్నార్ అందాలకుతోడు హంసనందిని యోగాభంగిమలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

హంసనందిని మున్నార్ నుంచి రోడ్ ట్రిప్ ద్వారా టెక్కడికి వెళ్లింది. టెక్కడి అందాలను కెమెరాలో బందించింది. టెక్కడి అందాలను వ్లాగ్ ట్రావెల్ చాలా చక్కగా చూపించింది. టెక్కడిలోని ప్రకృతి సోయగాయలు.. రెస్టారెంట్స్.. స్విమ్మింగ్ పూల్స్ అందాలను చూపించారు. హంసనందిని బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా టెక్కడిలోనే జరిగాయి. 

టెక్కడిలోనే ఓ రెస్టారెంట్లో స్విమ్నింగ్ పూల్ పక్కనే హంసనందిని బర్త్ డే కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను హంసనందిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టెక్కడిలో హంసనందిని చేసిన ట్రావెల్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. 

Also Read: కేరళ ఫారెస్టులో ‘హంస’ విహారం