Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Gold Silver rates today

 Gold-Silver Price Today: మార్కెట్లో బంగారం-వెండి ధరలు

  • ఫిబ్రవరి 1న బంగారం.. వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

Gold rates, Silver rates, gold today, sliver today, gold sliver trends, gold rates india, gold rates hyderbad, gold rates vizag, silver rates india, silver rates hyderabad, silver rates vizag, బంగారం వెండి ధరలు
Gold Silver rates today

బంగారు.. వెండి వస్తువులను చాలామంది ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడిగానూ చూస్తుంటారు. బంగారం.. వెండి ధరలు ప్రపంచ మార్కెట్ ఆధారంగా పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. భారత్ లో ఆడవాళ్లు బంగారాన్ని కేవలం అలంకారంప్రాయంగా చూస్తుంటారు.

బంగారంపై మహిళలకు ఉన్న మక్కువే భారత్ ఆర్థిక వ్యవస్థను చాలాసార్లు కాపాడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన సమయంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటానికి భారత్ లోని బంగారం నిల్వలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బంగారాన్ని అత్యధికంగా వినియోగించే.. కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలుస్తూ ఉంటుంది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉండటంతో ఒకరోజు తగ్గితే మరోరోజు భారీగా పెరగడం కన్పిస్తూ ఉంటుంది. 

బంగారం ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనుగోలు చేయాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజు బంగారం.. వెండి ధరలను పాఠకులకు కోసం అందించే ప్రయత్నం Useintrend చేస్తోంది. 

ఫిబ్రవరి 1న బంగారం.. వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఈరోజు భారత మార్కెట్ తోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. జనవరి 31తో ఫిబ్రవరి 1న బంగారం ధరలు సల్పంగా పెరిగాయి. ఇండియా మార్కెట్లో 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు నిన్న రూ.45వేల810 ఉండగా ఫిబ్రవరి 1న(నేడు) ఆ ధర రూ.45వేల820కి చేరింది. నిన్నటితో పోలిస్తే 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు పదిరూపాయలు పెరిగింది. 

24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు నిన్న రూ.49వేల960 ఉండగా ఫిబ్రవరి 1న(నేడు) ఆ ధర రూ.49వేల970కి చేరింది. 22క్యారెట్ల బంగారం మాదిరిగానే 24క్యారెట్ల బంగారం ధర సల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 10గ్రాములకు పది రూపాయల ధర పెరిగింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

ఫిబ్రవరి 1న హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ.45వేల820 ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ.45వేల 970ఉంది. విజయవాడలో 22క్యారెట్ల బంగారం ధర రూ.45వేల820 ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ.45వేల970.. విశాఖపట్టణంలో సైతం 22క్యారెట్ల బంగారం రూ.45వేల820.. 24క్యారెట్ల బంగారం ధర రూ.45వేల970గా ఉంది. నిన్నటితో పోలిస్తే బంగారం 10గ్రాములకు పది రూపాయలు పెరిగింది. 

వెండి ధరలు..

ఫిబ్రవరి 1న ఇండియాలో వెండి ధర 10గ్రాములు రూ.746 ఉండగా వంద గ్రాములు రూ.7వేల460గా ఉంది. నిన్నటికి నేటికి వెండి ధరల్లో ఎలాంటి తేడా లేదు. హైదరాబాద్.. విజయవాడ.. విశాఖపట్నంలోనూ వెండి ధర 10గ్రాములు రూ.746 ఉండగా 100గ్రాముల ధర రూ.7వేల460గానే ఉంది. 

Post a Comment

0 Comments