Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

PSLV C-51 launch grand success.. amazonia-1-18-co-passenger

 ఇస్రో ఖాతాలో మరో విజయం.. పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం గ్రాండ్ సక్సెస్

ISRO, PSLV C-51, ISRO success, amazonia-1,18-co-passenger, satellites, pslv-c52, pslv-c50, brazil satellites

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ఆదివారం ఉదయం 10.24నిమిషాలకు ఇస్రో తనకు అచ్చివచ్చిన పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. 

పీఎస్ఎల్వీ-51 రాకెట్ ద్వారా ఒక బ్రెజిల్ ఉపగ్రహంతోపాటు మరో18 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి విజయవంతం పంపించింది. బ్రెజిల్ కు చెందిన అమెజోనియా-1 అనే ఉపగ్రహం ఉంది. ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటన్ ఇస్రో కేంద్రంలో స్వయంగా తిలకించారు.

అమెజోనియా ప్రయోగం ద్వారా బ్రెజిల్ లోని అమెజాన్ ప్రాంతాన్ని మానిటరింగ్ చేయడంతోపాటు అక్కడి వ్యవసాయ భూముల విశ్లేషణకు ఎంతగానో దోహదపడనుంది. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి భారత ప్రధాని మోదీ ఫొటో.. ఆత్మనిర్భర్ మిషన్.. భగద్గీత కాపీ.. వెయ్యిమంది విదేశీయుల పేర్లు.. చైన్నెకి చెందిన విద్యార్థులను పేర్లను కూడా ఇస్రో నింగిలోకి పంపింది. 

పీఎస్ఎల్వీ-51 ప్రయోగాన్ని ఇస్రో ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో జరిపారు. పీఎస్ఎల్వీ-51 రాకెట్ ప్రయోగం విజయంవంతం అవడంతో ఇస్రో చైర్మన్ శివన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగ సమయంలో ఇస్రోలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.


Post a Comment

0 Comments