Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

improve eyesight advisable diet carrot egg fish

 కంటిచూపు మెరుగు పడేందుకు ఈ డైట్ తీసుకుంటే మంచిది..!

మనిషి గల పంచేద్రియాలలో కళ్లకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. కళ్లు లేకపోతే అంతా చీకటే. మనం వస్తువును ముట్టుకోవాలన్నా.. తాకాలన్నా.. కాలుతీసి బయట అడుగుపెట్టాలన్న కంటిచూపు ఉండాల్సిందే. 

కళ్ళ ప్రాముఖ్యతను గుర్తించిన పెద్దలు ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నారు. చాలామంది కళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్టించుకోకుంది. కంటిచూపు మందగిస్తే తప్ప వారికి కంటిచూపు యొక్క ప్రాముఖ్యత గుర్తుకు రావడం లేదు. 

ప్రతీరోజూ మనం తీసుకునే ఆహారంలో కంటికి సంబంధించిన డైట్ ఉండాలా చూసుకుంటే భవిష్యత్తులో కళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు కూడా ఇప్పుడే చెప్పబోయే డైట్ ఉపయోగపడుతుంది. 

  • కంటిచూపు మెరుగుపర్చుకునేందుకు ఆహారంలో ముఖ్యంగా క్యారెట్.. కోడిగుడ్డు.. చేపలు.. పచ్చటి ఆకుకూరలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లో కళ్ళకు సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి. 
  • క్యారెట్ కు కళ్ళకు పోషణి అని పేరు కూడా ఉందంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మన కంటిలోని రెటీనాస్ క్యారెట్లోని పోషకాలు చాలా మేలు చేస్తాయి. వీలైనంత వరకు మన ఆహారంలో క్యారెట్ తీసుకుంటే కళ్ళకు చాలా మంచిది. 
  • కోడిగుడ్డులోనూ కళ్ళకు మేలుచేసే పోషకాలున్నాయి. పచ్చసోనలో ఏ విటమిన్.. లుటిన్.. జియాక్సంతిన్.. జింక్ తదితర పోషకాలు ఉంటాయి. ఏ విటమన్ మన కంటిలోని కార్నియాకు రక్షణగా నిలుస్తుంది. జింక్ రెటీనా బలాన్ని పెంచడంతో సాయం చేస్తుంది. 
  • చేపల్లోని పోషకాలు సైతం కంటిచూపును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా సాల్మన్ చేప కంటి శ్రేయస్సుకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. 
  • బ్రోకలీ.. పచ్చిమిరియాలు.. పచ్చి ఆకుకూరలు కంటిచూపును మెరుగుపర్చడంలో సాయం చేస్తాయి. కళ్లకు సంబంధింని దృశ్య బలహీనతలను అదుపులో ఉంచడంలో పైన చెప్పిన ఆహార పదార్థాలు సాయంచేయం చేస్తాయి. 

Tags: how to improve eyesight, new born eye sight, baby eyesight, eyesight, eyesight test, eyesight problems, eye sight chart, eyesight scale, eyesight test 6/6, eyesight blurry, eyesight meaning, eyesight means,  normal eye sight, bad eyesight, subaru eyesight, best eyesight. improve eyesight advisable, eye diet carrot egg fish. 

Post a Comment

0 Comments