టాలీవుడ్లోని సెలబ్రెటీల్లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టు చూద్దాం పదండి..!
Best Friends List of Celebrities in Tollywood: ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అని ఎవరు అన్నారోగానీ ఆ మాటలు అక్షర సత్యం. పుట్టుకలో మనకు తోడు రాకున్న చచ్చే వరకు మనతో నడిచే బంధం ఏదైనా ఉందంటే అది ఒక్క స్నేహబంధం. అలాంటి బంధాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెలలో వచ్చే తొలి ఆదివారం నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
2021లో ఆగస్టు ఒకటినాడే తొలి ఆదివారం రావడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మిత్రులను కలుసుకొని పార్టీలు చేసుకోవడం.. విషెస్ చెప్పడం లాంటివి చేస్తున్నారు. మన టాలీవుడ్లోనూ చాలామంది బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. వీరి లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ కొంతమంది గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.
అగ్రహీరోల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెల్సిందే. అయితే వీరిద్దరు ఒక్క చిత్రంలోనూ కలిసి నటించకపోవడం అభిమానులకు పెద్ద లోటని చెప్పచ్చు. ఆ తర్వాత ప్లేసులో విక్టరీ వెంకటేష్-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉంటారు. వీరిద్దరు కలిసి ‘గోపాలా గోపాలా’ మూవీలో నటించారు. ఈ మూవీ పెద్ద హిట్ అయింది.
అదేవిధంగా పవన్ కల్యాణ్-అలీ బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ ప్రతీ సినిమాలోనూ అలీ ఉంటాడు. అలీ తన గుండెలాంటి వాడని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు. అయితే పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లాక అలీకి.. పవన్ కల్యాణ్ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి బంధం మునుపటిలా కొనసాగడం లేదని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరు మళ్లీ ఒకటి కావాలని కోరుకుంటున్నారు.
రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. రాజమౌళి ఎక్కువగా రిపీట్ చేసే హీరోల్లో ఎన్టీఆర్ ముందుంటాడు. రాజమౌళి ఎన్టీఆర్ ను ముద్దుగా తారక్ అని పిలిస్తే.. ఎన్టీఆర్ రాజమౌళిని జక్కన్న అని పిలుస్తాడు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రాంచరణ్-ఎన్టీఆర్ సైతం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. అలాగే ఎన్టీఆర్-రాజీవ్ కనకాల కూడా బెస్ట్ ఫ్రెండ్సే.
వర్షంలో మూవీలో నటించిన హీరోగా నించిన ప్రభాస్.. విలన్ గా నటించిన గోపిచంద్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మూవీతో వీరిబంధం బలపడిందట. అలాగే రాంచరణ్-రానా-శర్వానంద్ ముగ్గురు కూడా బాల్యమిత్రులు. ఈ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. నాని-శర్వానంద్.. నాని-అల్లరి నరేష్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
డైరెక్టర్ తివ్రిక్రమ్.. కమెడీయన్ కమ్ హీరో సునిల్ వీరిద్దరు ఇండస్ట్రీలోకి రాకముందే బెస్ట్ ఫ్రెండ్స్ అట. అలాగే హీరో శ్రీకాంత్-శివాజీరాజా.. డైరెక్టర్ పూరి జగన్నాథ్-హీరో రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు-సుమంత్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరంతా కూడా పార్టీలకు ఫంక్షన్లకు తిరుగుతూ సరదాగా గడుపుతుంటారు.
0 Comments