బీఎండబ్ల్యూ స్పెషల్ ఎడిషన్ ధర అందుబాటులోనే..!
- మినీ హచ్ బ్యాక్ లో విడుదల స్పెషల్ ఎడిషన్ ధర రూ.41.7లక్షలుగా బీఎండబ్ల్యూ కంపెనీ నిర్ణయించింది.
BMW Hachback |
జర్మనీలో విలాసవంతమైన కార్ల తయారీకి బీఎండబ్ల్యూ ప్రసిద్ది. ఈ కార్ల కంపెనీ నుంచి సరికొత్త ఎడిషన్ అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లోనూ అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
బీఎండబ్యూ భారత మార్కెట్లో కోటి నుంచి మూడు కోట్ల రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఇక తాజాగా బీఎండబ్ల్యూ అందుబాటు ధరలో ఓ స్పెషల్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. మిని హ్యాచ్ బ్యాక్ లో స్పెషల్ ఎడిషన్ గా మిని పాడీ హాప్ కిర్క్ ను విడుదల చేసింది.
ఈ కొత్త మోడల్ ధర రూ.41.7లక్షలుగా బీఎండబ్ల్యూ కంపెనీ నిర్ణయించింది. ఈ కారు కేవలం 6.7సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. గంటకు 235కిలోమీటర్ల వేగాన్ని చేధించనుంది.
కంప్లీట్లీ బిల్డ్ అప్ యూనిట్(సీబీయూ)గా వస్తున్న బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ కేవలం 15యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకు వచ్చిన బీఎండబ్ల్యూలతో పొలిస్తే దీని ధర అందుబాటులో ఉన్నట్లే కన్పిస్తోంది.
Also Read: 2021లో బెంజ్ నుంచి సరికొత్త మాస్ట్రో.. జిగేల్ మంటున్న ధర..!
Also Read: ఫార్చూనర్ నుంచి లెటేస్ట్ మోడల్ రిలీజ్.. ధర ఎంతంటే?
0 Comments