Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

"పడమటి సంధ్యా రాగం కవి సమ్మేళనంలో ఉపేంద్రాచారికి పురస్కారం"

"వాషింగ్టన్ తెలుగు సమితి కవి సమ్మేళనంలో ఉపేంద్రాచారికి పురస్కారం"


జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్ట్ 15 భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జూమ్ లో వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో పడమటి సంధ్యా రాగం పేరుతో కవితా మహోత్సవం నిర్వహించారు. 

వాషింగ్టన్ తెలుగు సమితి ప్రెసిడెంట్ షకీల్ భాషా, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి, జనరల్ సెక్రటరీ జైపాల్ రెడ్డి దొడ్డ, కోశాధికారి రఘు ప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శి సునీత కొత్తపల్లి, లిటరరీ సెక్రటరీ మధు రెడ్డి, వెబ్ మాస్టర్ ప్రకాష్ కొండూరు ఆధ్వర్యంలో "అమెరికాతో భారతీయుల అనుబంధం" అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ రచయితలు చంద్రబోస్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, సిరాశ్రీ ముఖ్య అతిథులుగా జూమ్ ద్వారా హాజరయ్యారు. కవి సమ్మేళనలో ఔత్సాహిక కవులు తమ కవితలను ఆలపించారు. 

అనంతరం విజేతలకు పురస్కారాలు ప్రకటించారు. హనుమంతరావు కు సర్వోత్తమ పురస్కారం, రుద్ర శివకు ఉత్తమ పురస్కారం, విజయ భారతికి విశిష్ఠ పురస్కారం, వెంకట శివ కుమార్ కు విశేష పురస్కారం, సొల్లేటి ఉపేంద్రాచారి, చిల్లర శివ కుమార్ కు గౌరవ పురస్కారాలు లభించాయి.

ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని దీప్తి నాగ్, ప్రియ కొడుకుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో బాల గాయకుడు ధీరజ్ పాడిన "గాంధీ పుట్టినదేశం, రఘురాముడు ఏలిన రాజ్యం", "దేశమంటే మతం కాదోయ్, గతం కాదోయ్" పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

Post a Comment

0 Comments