Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Top Ten Blockbuster Movies in Chiranjeevi Vijaya shanti Combination

 చిరు-విజయశాంతి జోడీ ఎందుకంత స్పెషల్.. 

వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన టాప్ టెన్ బ్లాక్ బస్టర్ మూవీస్

Chiranjeevi Vijaya Shanthi

Top Movies in Chiranjeevi Vijaya shanti: మెగాస్టార్ చిరంజీవి.. లేడి అమితాబ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చూడటానికి సినీప్రియులు ఎంతగానో ఇష్టం చూపుతుంటాడరు. 80's, 90'sలలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. వీరిద్దరు డాన్స్.. కామెడీ.. యాక్టింగ్ విషయాల్లో పోటీపడుతూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటారు. దీంతో వీరి సినిమాలను ప్రేక్షకులు అప్పట్లో మళ్లీ మళ్లీ చూసేవారు. 

 వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన టాప్ టెన్ బ్లాక్ బస్టర్ మూవీలను పరిశీలిస్తే.. అందులో ఛాలెంజ్, కొండవీటిరాజా, స్వయంకృషి, పసివాడి ప్రాణం, మంచిదొంగ, యమునికి మొగుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, కోండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, మొకానిక్ అల్లుడు ఉంటాయి. 

ఛాలెంజ్ మూవీ 1984, ఆగస్టు 9న విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చిరుకు జోడీగా విజయశాంతి.. సుహాసిని నటించారు. ఓ నిరుద్యోగి తనకు ఎదురైన అవమానాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాడనే అంశాన్ని దర్శకుడు  ఏ. కోదండరామ్ చక్కగా చూపించారు. ఈ మూవీలో చిరు, విజయశాంతిపై తీసిన ‘ఇందువాదన’ సాంగ్ ఇప్పటికీ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. 

కొండవీటి రాజా మూవీ 1986 జనవరి 31న విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చిరుకు జోడీగా రాధా, విజయశాంతి నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా కె.చక్రవర్తి సంగీతం అందించారు. ఇందులో రాధా ప్రధాన కథనాయిక అయినప్పటికీ చిరంజీవి-విజయశాంతి అన్ స్క్రీన్ కెమెస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

స్వయంకృషి మూవీ 1987 సెప్టెంబర్ 3న విడుదలైంది. కళాతపస్వీ కె.విశ్వనాథ్ డైరెక్టర్లో తెరకెక్కిన ఈ మూవీకి అనేక అవార్డులు వచ్చాయి. చిరంజీవికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. ఈ చిత్రం మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వందరోజులకు పైగా ఆడింది. 

పసివాడి ప్రాణం మూవీ 1987 జూలై 23న విడుదలైంది. ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా అల్లు అరవింద్ నిర్మించారు. ఇది చిరంజీవికి మొట్టమొదటి వెండి-జూబ్లీ హిట్. ఈ మూవీలోని ‘కాశ్మీరీ లోయలో.. కన్యాకుమారి’ పాట ఇప్పటికీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

మంచిదొంగ సినిమా 1988 జనవరి 14న విడుదలైంది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు యాక్షన్ కామెడీగా ఈ మూవీని తెరకెక్కించాడు. చిరుకు జోడీగా విజయశాంతి.. సుహాసిని నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఇందులో మెహన్ బాబు పోలీస్ పాత్రలో నటించాడు. 

 యమునికి మొగుడు సినిమా 1988 ఏప్రిల్ 29న రిలీజైంది. డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి ఈ మూవీని యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేశాడు. 1988లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఈ సినిమా ఒకటి. విజయశాంతి.. రాధలు చిరుకు జోడీగా నటించారు. చిరంజీవి, విజయశాంతిపై తీసిన ‘వనజల్లు గిల్లుకుంటే’ పాట తెలుగులోని ఉత్తమ రొమాంటిక్ నంబర్లలో ఒకటిగా నిలిచింది. 

 అత్తకుయముడు అమ్మాయికి మొగుడు మూవీ 1989 జనవరి 14న విడులైంది. రోమాంటిక్ యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు. వాణిశ్రీ అత్తగా.. ఆమె కూతురిగా విజయశాంతి నటించింది. తెలుగు సూపర్ హిట్ అయిన ఈ మూవీ తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. 

కొండవీటిదొంగ సినిమా 1990 మార్చి 9న విడులైంది. ఏ. కొదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీకి ఇళయారాజా సంగీతం అందించాడు. చిరుకు జోడీగా రాధా.. విజయశాంతి నటించారు. ఈ మూవీ విడుదలైన తొలివారంలోనే 7.4మిలియన్ల వసూళ్లను రాబట్టింది. 70ఎంఎం 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.  

గ్యాంగ్ లీడర్ మూవీ 1991 మే 9న విడుదలైంది. డైరెక్టర్ విజయ బాపినేడు ఈ సినిమాను యాక్షన్ రోమాంటిక్ గా తెరకెక్కించాడు. బాప్పి లహారి మ్యూజిక్ కు డాన్స్ మాస్టర్ ప్రభుదేవా అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేశాడు. ఈ మూవీ ‘జగదేకవీరుడు.. అతిలోక సుందరి’ కలెక్షన్లను దాటేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 

మెకానిక్ అల్లుడు సినిమా 1993 మే 27న విడుదలైంది. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వర్ రావు కీలక పాత్రలో నటించారు. బీ.గోపాల్ ఈ మూవీని యాక్షన్ కామెడీ ఎంటటైనర్ గా తీర్చిదిద్దగా అల్లు అరవింద్ నిర్మించాడు. కోటి సంగీతం అందిచాడు. చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్లో ఇప్పటి వచ్చిన చిత్రాల్లో ఇదే చివరి చిత్రంగా నిలుస్తోంది. 

ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో మూవీ రాకపోవడం అభిమానులను నిరుత్సానికి గురిచేస్తుంది. అయితే చిరంజీవి.. విజయశాంతి సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాక వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరి కోరిక ఏ సినిమాతో నెరవెరుతుందో వేచిచూడాల్సిందే..!

Post a Comment

0 Comments