‘ఆచార్య’ మూవీ ఆర్ట్ డైరెక్టర్
ఇంతకు ముందే ఏయే సినిమాలకు పనిచేయరంటే?
Acharya art director Suresh Selvarajan :మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిపోయాయి. కరోనా ఎంట్రీకి ముందే ‘ఖైదీ-150’.. ‘సైరా నర్సింహారెడ్డి’ మూవీల్లో నటించారు. చిరంజీవి-152వ సినిమాగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. లాక్డౌన్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుసార్లు షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
ఈ మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్.. టీజర్స్.. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీనియర్ హీరోయిన్ సంగీత.. మెగాస్టార్ కాంబోలో వచ్చిన ‘లాహే లాహే’ సాంగ్ యూట్యూబ్లో 25మిలియన్ల వ్యూస్ ను ఇప్పటికే క్రాస్ చేసింది.
‘ఆచార్య’ మూవీ కోసం దాదాపు 10కోట్లతో వేసిన టెంపుల్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సెల్వ రాజన్ ఆధ్వర్యంలో వేసిన అమ్మవారి టెంపుల్.. ధర్మస్థలి సెట్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సెట్ కు సంబంధించిన సీన్స్ ఇప్పటికే బయటికి వచ్చి వైరల్ అయ్యాయి. అద్భుతంగా సెట్స్ డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వన్ ను దర్శకుడు కోరటాల శివ. మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రశంసించారు.
ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ ‘ఆచార్య’ మూవీ కంటే ముందుగా రజనీకాంత్ నటించిన ‘పెట్టా’.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’.. బాలీవుడ్లో తెరెక్కిన ‘క్రిష్-3’.. ‘అగ్నిపథ్’.. ‘యాన్’ మూవీలకు పని చేశారు. ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్ సెల్వరాజన్ అద్భుతమైన సెట్లువేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో వచ్చే దసరా లేదంటే సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
0 Comments