Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Indonesia Aeroplane Missing in the Sky

ఆకాశంలో విమానం మిస్సింగ్.. సముద్రంలో గాలింపు..!

  • జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న ఎస్‌జే-182 శ్రీవిజయ ఎయిర్‌బోయింగ్‌ కు నిలిచిన సిగ్నల్స్

Indonesia Aeroplan Missing, Indonesia flight, Indonesia flight 152
Flight Missing

ఆకాశంలోకి ఎగిరిన నాలుగు నిమిషాలకే విమానానికి రాడార్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 59మంది ప్రయాణీకులు ఉండటంతో వారి ఆచూకీ కోసం కోసం అధికారులు గాలింపు చేపట్టారు. అయితే ప్రయాణీకుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది. 

ఇండినేషియా రాజధాని జకార్తా నుంచి పాంటియానక్ కు ఎస్‌జే-182 శ్రీవిజయ ఎయిర్‌బోయింగ్‌ బయలుదేరింది. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే విమానానికి రాడార్ వ్యవస్థతో సిగ్నల్స్ కటయ్యాయి. అధికారులు సిగ్నల్స్ పునరుద్ధరించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

ఇదిలా ఉంటే స్థానిక మీడియాలో మాత్రం ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందనే కథనాలు వస్తున్నాయి. దీంతో ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళన నెలకొంది. గతంలోనూ ఇండోనేషియాకు చెందిన ఓ విమానం మిస్సయి సముద్రంలో కూలిపోయింది. 2018 అక్టోబర్‌ 29న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 189మంది మృతిచెందారు. 

జకార్తా మీడియా కథనాల ప్రకారం.. ఎస్‌జే-182 శ్రీవిజయ ఎయిర్‌బోయింగ్‌ ఓ ద్వీపంలోని సముద్ర ప్రాంతంలో కూలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. దీంతో ఆ దేశానికి చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది సముద్రంలో గాలింపును ముమ్మరం చేశారు. 

సముద్రంలోని బ్లాక్ హోల్స్ కారణంగానే విమానాలకు సిగ్నల్ కట్ అవుతూ ప్రమాదాలు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా పలువురు పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. 

Post a Comment

0 Comments