మెర్సిడెస్ బెంజ్ ధరలకు రెక్కలు..!
- జనవరి 15 నుంచి ఐదు శాతం పెరుగనున్న మెర్సిడెస్ బెంజ్ ధరలు
Mercedes Benz |
కొత్త ఏడాదిలో బెంజ్ కార్ల ధరలకు రెక్కలు రాబోతున్నాయి. లగ్జరీ కార్ల తయారీకి ప్రసిద్ధి చెందిన మెర్సిడెస్ బెంజ్ జనవరి 15 నుంచి 5శాతం ధరలను ఇండియాలో పెంచబోతుంది.
బెంజ్లోని పలు మోడళ్ల ధరలు 5శాతం పెరగడం ద్వారా రూ.2లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఎక్కువ వ్యయం కానుంది. బెంజ్లోని ఎండ్ మోడల్ సీ క్లాస్ ధర రూ.2లక్షలు.. టాప్ ఎండ్ మోడల్ ఏఎంజీ జీటీ 63ఎస్ డోర్ కూపే ధరలు దాదాపు రూ.15 లక్షల వరకు పెరుగనుంది.
బెంజ్లోని జీఎల్ఈ.. జీఎల్ఎష్.. ఎస్ యూవీసీ.. ఈ క్లాస్ మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి ధరలను పెంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నిర్ణయాన్ని వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు మెర్సిడెస్ బెంజ్ కంపెనీ పేర్కొంది.
సీ-క్లాస్ పెట్రోల్ ధర రూ.49.50లక్షలు.. డిజీల్ రూ.51.50లక్షలు.. ఈ-క్లాస్ పెట్రోల్ రూ.67.50లక్షలు.. డీజిల్ రూ.68.50లక్షలు.. ఏఎంజీ జీటీ 4డోర్ కపూల్ రూ.2.60కోట్లుగా నిర్ణయించారు.
2021లో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఉత్పత్తి శ్రేణిని పెంచడంతోపాటు సాంకేతికత మీద పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా బెంజ్ ధరలను జనవరి 15నుంచి ఐదు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 2021లో బెంజ్ నుంచి సరికొత్త మాస్ట్రో
0 Comments