Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Ravi Teja Greetings With Krack Trailer

 న్యూ ఇయర్లో ‘క్రాక్’ పలకరింపు.. ట్రైలర్లో దుమ్ములేపిన మాస్ మహారాజ్..! 

Krack Trailer Raviteja

2021 సంవత్సరానికి మాస్ మహారాజ్ రవితేజ తనదైన స్టైల్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. 2020 సంవత్సరానికి ముందు వరుస ప్లాపులతో ఉన్న రవితేజ 2021లో మళ్లీ తన స్టామీనా చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. 

ఈక్రమంలోనే జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా తన తాజా చిత్రం ‘క్రాక్’ ట్రైలర్ ను విడుదల చేశాడు. 2నిమిషాల 10సెకన్ల నిడివి ఉన్న క్రాక్ ట్రైలర్ ఆద్యంతం మాస్ మహారాజ్ మ్యానరిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. 

రవితేజకు అచ్చివచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ‘క్రాక్’ మూవీలో పోషిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే రవితేజ హిట్టుకొట్టడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. రవితేజ మార్క్ డైలాగులు ట్రైలర్లో మతాబులా పేలాయి. 

రవితేజ.. శృతిహాసన్ రోమాన్స్ ఓ రేంజులో ఉండబోతుందని క్రాక్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీలో సముతిరాకాని.. వరలక్ష్మి శరత్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా తమన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సాయిమాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

Krack Triler, Krack Teaser, Varalaxmi sarathkumar, Mass maharaja, krack movieposter, sankranthi, shruti hassan, gopichand malineni, Krack raviteja,Krack trailer telugu, Krack official trailer, Krack Movie Trailer Raviteja, Shruti Hassan, Gopichand Malineni, Thaman S, Krack Movie Teaser Raviteja, Raviteja, Krack Trailer, Krack Songs, Latest Telugu Trailers, Mass Maharaja, Raviteja Movies, Raviteja New movies, krack telugu movie trailer. క్రాక్ మూవీ ట్రైలర్, రవితేజ క్రాక్.. శృతిహాసన్ క్రాక్.. వరలక్ష్మీ శరత్ కుమార్.

Post a Comment

0 Comments