అమ్మల దర్శనానికి వేళాయె..!
- మినీ మేడారం జాతరకు తేదిలు ఖరారు
Warangal Medaram Jathara |
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు పేరొందింది. మేడారంలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ.. పగిదిద్దరాజులను దర్శించుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తులపాలిల కొంగుబంగారంగా మారిన సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రభుత్వం ప్రతీ రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తోంది.
రెండేళ్లకోసారి జరిగే మహాజాతర తర్వాత వచ్చే ఏడాది వనదేవతలకు మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ పండుకు సైతం లక్షలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో మండమెలిగే పండుగను మినీ మేడారం జాతరకు పిలుస్తుంటారు. ఈసారి మినీ మేడారం జాతరకు సుమారు 10లక్షలమంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా.
మినీ మేడారం జాతర నిర్వహణ కోసం ఆదివారం పూజారుల సంఘం ప్రత్యేకంగా సమావేశమై తేదిలను ఖారారు చేశారు. నాగశుద్ధ పౌర్ణమి గడియల ప్రకారంగా ఫిబ్రవరి 24 నుంచి 27వ తేది వరకు మినీ మేడారం జాతరను నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు.
ఫిబ్రవరి 24, 25 తేదిల్లో సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు.. 26న భక్తుల దర్శనం.. 27న పూజా కార్యక్రమాలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయని జగ్గారావు స్పష్టం చేశారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీరు.. పారిశుధ్య.. మరుగుదొడ్ల సదుపాయం.. స్నానఘట్టాల ఏర్పాట్లను చేయాలని కోరారు.
మినీ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్ గఢ్.. మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. లాక్డౌన్ తర్వాత అమ్మవార్ల ఆలయాన్ని తెరిచిన తర్వాత భక్తులు బుధ.. గురు..శుక్ర.. ఆదివారాల్లో పెద్దసంఖ్యలో తరలివస్తూ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫిబ్రవరిలో అమ్మల జాతర ప్రారంభం కానుండటంతో మేడారం కిక్కిరిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
0 Comments