ఇండియాలో తొలి ఎయిర్ ట్యాక్సీ ప్రారంభం.. ఎక్కడి నుంచంటే?
- చండీగఢ్ విమానాశ్రయం నుంచి తొలి ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
Air Taxi |
ఇండియాలో తొలి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు హర్యానా రాష్ట్రంలో ప్రారంభమైంది. జనవరి 15న చండీగఢ్ లోని విమానాశ్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రయాణీకులను చండీగఢ్ నుంచి హిసార్ వరకు చేరవేయనున్నారు.
కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా ప్రారంభించిన ఎయిర్ ట్యాక్సీ సర్వీసును హర్యానా ప్రభుత్వం తొలి దశలో చండీగఢ్ నుంచి హిసార్ వరకు నిన్న ప్రారంభించింది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని మరో వారం రోజుల్లో ప్రారంభించనుంది.
మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్.. హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పర్యాటక ప్రాంతాలైన సిమ్లా.. కులూతోపాటు ఇతర ప్రాంతాలకు ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. వీలైనంత తర్వగా వీటిని ప్రారంభించేందుకు హర్యానా సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
ఎయిర్ ట్యాక్సీ సర్వీసు కోసం టెక్నామ్ పీ 2006 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నామ్ పీ 2006 విమానంలో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రయాణించే వారికి ప్రభుత్వం కొన్ని రాయతీలు కూడా ఇవ్వనుంది. ఈ సర్వీసులను మున్ముందు టైర్ 2.. టైర్ 3 నగరాలకు సైతం అనుసంధానించనుంది.
కరోనాతో ఎఫెక్ట్ తీవ్రంగా దెబ్బతిన్న విమాన రంగానికి ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు కొంత మేలు చేకూర్చే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. హర్యానా బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు రానున్న రోజుల్లో మధ్యతరగతి.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే కన్పిస్తున్నాయి. ప్రభుత్వం ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను ఇస్తుండటంతో ఈ రంగం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: తెలంగాణ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ జర్నీ..!
0 Comments