Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Power Star Pawan Kalyan PanIndia Movie Started

పవర్ స్టార్ ప్యాన్ ఇండియా మూవీ స్టాట్.. ఫ్యాన్స్ కు పునకాలే..!

  • పవన్-క్రిష్ కాంబోలో pspk 27 మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం

pspk 27th, pspk27, pspk27 movie, pspk 27 poster, pspk 27 first look, pspk 27 heroine
PSPK-27 Movie Regula Shooting strat

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి పలు మూవీలకు కమిటైన సంగతి తెల్సిందే..!

పవన్ కల్యాణ్ నటించే మూవీలన్నీ కూడా క్రేజీ కాంబోషన్లోనే సెట్టయ్యాయి. డైరెక్టర్ జగర్లపూడి క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితోపాటు 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ మూవీలో నటించనున్నాడు. 

పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ నటిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే పవన్ మాత్రం తన అభిమానుల్లో జోష్ నింపేలా డైరెక్టర్ క్రిష్ మూవీని లైన్లో పెట్టాడు. 

పవన్-క్రిష్ కాంబోలోని మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈమేరకు pspk 27 మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైందని షూటింగ్ లోకేషన్లోని ఓ పిక్ ను ట్వీటర్లో షేర్ చేసి  చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

పవన్-క్రిష్ కాంబోలోని సినిమా విషయానికొస్తే ఇందులో పవర్ స్టార్ సరికొత్తగా కన్పించబోతున్నాడు. బందిపోటు దొంగగా పవన్ ను క్రిష్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మొగల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా పవన్ సినిమా రాబోతుంది. 

పవన్ కల్యాణ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించే మూవీకి కేవలం 25రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. జెట్ స్పీడుతో సినిమాలు చేసే క్రిష్ ఈ మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. 

ఈ మూవీ షూటింగ్ పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నాడు. మరోవైపు ఈ సినిమాకు సమాంతరంగా 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లోనూ పవన్ పాల్గొనబోతున్నాడని టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా పవన్ కొత్త మూవీ స్టాట్ కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

director Krish, Pan India, pawan kalyan, pspk 27th, pspk27, pspk27 movie
Director krish jagarlamudi

Post a Comment

0 Comments