ఆ పండుగ.. మగవాళ్లకు మాత్రమే..!
- ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆనాదిగా వస్తున్న వింత ఆచారం
Men's Pongal |
ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం.. నైవేద్యాలు సమర్పించడం ఆనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్లు ముందుంటారు. పూజలు. వ్రతాలు.. మొక్కులు.. నైవేద్యాలు తయారు చేయడంలో ఆడవాళ్లు లేకుండా చేయడం చాలా అరుదుగా కన్పిస్తుంటుంది.
విదేశాల్లో కొన్ని ఫెస్టివెల్స్ మగవాళ్లకు ప్రత్యేకంగా చేసుకుంటారని టీవీల్లో.. పత్రికల్లో తరుచూ చూస్తుంటాం. అలాంటి వింత ఆచారమే మన తెలుగువాళ్లు కూడా పాటిస్తున్నారు. మగవాళ్లకు మాత్రమే మొక్కులు చెల్లించుకునే ఓ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో ఉందనే విషయం చాలామందికి తెలియదు.
ఆంధప్రదేశ్ లోని కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఆనాదిగా ఓ వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారు. ప్రతీయేటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున మగవాళ్ల పొంగళ్ల పండుగ ఘనంగా జరుగుతుంది. సంజీవరాయుని ఆలయంలో మగవాళ్లు మాత్రమే పొంగళ్లను తయారుచేసి దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
నిజానికి సంజీవరాయునికి ఆలయం.. విగ్రహమంటూ ఏమిలేదు. ఆ గ్రామంలో ఒక రాతి శిలపై ఉన్న లిపినే గ్రామస్థులంతా సంజీవరాయుడిగా కొలుస్తున్నారు. సంక్రాంతి ముందు ఆదివారం రోజున ఈ గ్రామానికి చెందిన వాళ్లంతా విదేశాల్లో ఉన్న ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెళుతుంటారు.
తిప్పాయపల్లెలోని మగవాళ్లంతా ఉదయాన్నే బుట్టల్లో పొంగళ్ల సామాగ్రిని తీసుకొని సంజీవరాయుడి వద్ద పొంగళ్లు తయారు చేస్తారు. ఈ పొంగళ్లను మగవాళ్లే సింగరాయుడికి నైవేద్యంగా పెడుతారు. ఈ ప్రసాదాన్ని ఆడవాళ్లకు పెట్టరు. కేవలం మగవాళ్లు మాత్రమే పెడుతారు. మహిళలు ఆలయ ప్రాంగణంలోకి రావడం నిషేధం. వాళ్లు దూరం నుంచే సంజీవరాయుడిని మొక్కుకొని తిరుగుముఖం పడుతారు.
ఈ ఆచారం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. తిప్పాయపల్లెలో కొన్నేళ్ల క్రితం ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడు. ఆయన పురుషులతో తప్ప మహిళలతో మాట్లాడేవాడు కాదు. ఆ బ్రాహ్మణుడు గ్రామం నుంచి వెళుతూ ఓ శిలపై లిపిని రాశాడు. గ్రామం ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలంటే ప్రతీయేటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామివారికి మగవాళ్లు మాత్రమే పొంగళ్లు పెట్టాలని చెప్పాడు.
ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట ప్రకారంగా నాటి నుంచి గ్రామంలోని మగవాళ్లంతా స్వామివారికి పొంగళ్లు నైవేద్యం పెడుతున్నారు. అదే ఆనవాయితీని 2021లోనూ తిప్పాయపల్లె గ్రామస్థులు కొనసాగించారు. సంక్రాంతి ముందు వచ్చిన ఆదివారం రోజు సంజీవరాయుడిని గ్రామంలోని మగవాళ్లంతా పొంగళ్లను తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు.
Also Read: సంక్రాంతి రోజున అల్లుడు అత్తగారింటికి ఎందుకెళ్లాలంటే?
0 Comments