Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

RMP Innovative Idea made the street dog walk Khammam

ఆర్ఎంపీ వినూత్న ఐడియా.. వీధి కుక్కను నడిచేలా చేసింది..!

  • చిన్నపిల్లలు ఆడుకునే బండి చక్రాలను వీధికుక్కకు అమర్చిన ఆర్ఎంపీ

Street Dog to Walk cart
Image source: samayam

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసింది అనే మాట మనం తరుచూ వింటూనే ఉంటాం. దీనిని అక్షరాల నిజం చేసి చూపించాడు ఓ ఆర్ఎంపీ. తనకు వచ్చిన ఓ వినూత్న ఐడియాతో ఒక వీధి కుక్కను తిరిగి నడిచేలా చేసి అందరి మన్నలను అందుకుంటున్నాడు. 

 ఖమ్మం జిల్లా కోణిజెర్ల మండలంలోని సంగారాయపాలెంలో షేక్ ఆషా అనే వ్యక్తి ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. ఆ గ్రామంలో వైద్యసేవలు చేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు

ఇదిలా ఉంటే ఆషా ఇంటి సమీపంలోనే ఓ వీధి కుక్క కాళ్లలేక.. నడుము విరిగి నానా అవస్థలు పడటాన్ని గమనించారు. ఆ వీధి కుక్క తిరిగి నడవడానికి ఏం చేయాలని ఆలోచించగా ఓ సూపర్ ఐడియా ఆషాకు తట్టింది. 

అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టి ఆ వీధి కుక్కను తిరిగి నడవగలిగేలా చేశారు. ఇంతకీ ఆ ఆర్ఎంపీకి వచ్చిన వినూత్న ఐడియా ఏంటంటే.. చిన్న పిల్లలు ఆడుకునే చక్రాల బండిని ఆ కుక్క వెనుకాల అమర్చడం. 

దీంతో ఆ కుక్క రెండు కాళ్లతో ముందుకు నడుస్తుంటో వెనుకాల బండి కదులుతోంది. చక్రాల బండి వల్ల ఆ వీధి కుక్క మునిపటిలా తిరిగి నడువ గలుగుతోంది. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రతీఒక్కరు షేక్ ఆషాను అభినందిస్తున్నారు. 

Post a Comment

0 Comments