Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Railway Apprentice Jobs -1004 Deadline| Railway Recruitments-2021

రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలు-1004.. ముగియనున్న గడువు..!

  • నైరుతి రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదల.. జనవరి 9లోగా దరఖాస్తు చేసుకోండి.
Railway Recruitments-2021

కొత్త ఏడాదిలో రైల్వే నుంచి కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ రైల్వే రిక్రూట్ మెంట్-2021 పేరిట నైరుతి రైల్వే 1004 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

హుబ్లీ రైల్వే రిక్రూట్ మెంట్ ఆధ్వర్యంలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ మెరిట్ ప్రకారం జరుగనుంది. హుబ్లీ.. బెంగళూరు.. మైసూరు డివిజన్లలో క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్.. సెంట్రలవ్ వర్క్ షాప్ లో పోస్టులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

1004 అప్రెంటీస్ పోస్టుల్లో హుబ్లీ డివిజన్లో 287.. క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ హుబ్లీ 217.. బెంగళూరు డివిజన్లో 280.. మైసూరు డివిజన్లో 177.. సెంట్రల్ వర్క్‌షాప్ మైసూరులో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

వీటిలో విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఫిట్టర్ 335.. ఫిట్టర్(క్యారేజ్ అండ్ వేగన్) 117.. ఫిట్టర్(డీజిల్ లోకోషెడ్) 37.. ఎలక్ట్రిషియన్ (డీజిల్ లోకోషెడ్) 17.. వెల్డర్ 55.. మెషినిస్టు 13.. టర్నర్ 13..ఎలక్ట్రిషియన్ 231.. కార్పెంటర్ 11.. పెయింటర్ 18.. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ 16.. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ 138.. స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పదో తరగతి పాసై సంబంధిత ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణలైన వారు ఈ అప్రంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 15నుంచి 24ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. వంద రూపాయాల ఫీజుతో అభ్యర్థులు https://www.rrchubli.in/ వెబ్‌సైట్లో అర్హత వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. 

Post a Comment

0 Comments