ఇస్రో రికార్డును బ్రేక్ చేసిన స్పేస్ ఎక్స్
- ఒకేసారి 143 ఉపగ్రహాలను నింగిలోకి పంపి సత్తాచాటిన స్పేస్ ఎక్స్
స్పేస్ ఎక్స్(twitter/SpaceX) |
అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాలు ముందున్నాయి. అమెరికా.. చైనా.. రష్యా దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో ఎప్పటికప్పుడు సత్తాచాటుతున్నాయి. ఈ దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోకుండా అంతరిక్ష పరిశోధనల్లో కొత్త రికార్డులను సృష్టించి అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది.
అత్యంత చౌకగా అంతరిక్షంలోని ఉపగ్రహాలను పంపించే దేశం ఒక్క భారత్ మాత్రమే. అతి తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను ఇండియా ప్రయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2017 సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ37 విమాన వాహన నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించి సరికొత్త రికార్డును సృష్టించింది.
అంతరిక్షంలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపడం ద్వారా ప్రపంచ దేశాలన్ని ఇండియావైపు దృష్టిసారించాయి. 2017 నుంచి ఇప్పటివరకు భారత్ పైనే ఆ రికార్డు ఉంది. అయితే తాజాగా ఈ రికార్డును స్పేస్ ఎక్స్(SPACE-X) బ్రేక్ చేసింది. అంతరిక్షంలోకి ఒకేసారి 143 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి స్పేస్ ఎక్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 విమాన వాహకనౌక ద్వారా ట్రాన్స్పోర్టర్ మిషన్-1 పేరిట నింగిలోకి ఒకేసారి 143ఉప గ్రహాలను తన తొలి ప్రయోగంలోనే చేసి ప్రపంచ రికార్డును సృష్టించింది. 143 శాటిలైట్లో 133కమర్షియల్.. అమెరికా ప్రభుత్వానికి సంబంధించినవి ఉండగా.. పది కంటే ఎక్కువ స్టార్ లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి.
స్పేస్ ఎక్స్(twitter/SpaceX) |
అంతరిక్షంలోకి 143 శాటిలైట్లను స్మాల్‌సాట్ రిడ్‌షేర్ ప్రొగ్రాం మిషన్ ద్వారా తొలి డెడికేటెడ్ ప్రయోగం నిర్వహించినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ పేర్కొంది. తొలి ప్రయోగంలోనే స్పేస్ ఎక్స్ అంతరిక్ష ప్రయోగాల్లో సత్తాచాటడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలన్ని ప్రభుత్వ సంస్థలే నిర్వహిస్తుండగా ప్రైవేట్ రంగం నుంచి స్పేస్ ఎక్స్ నింగిలోకి శాటిలైట్లను పంపింది.
ప్రపంచ దేశాలన్నీ సాధించలేని రికార్డును ఓ ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ చేసి చూపించింది. ఈ ఒక్క ప్రయోగంతో ఇస్రో పేరిట ఉన్న రికార్డును తిరగరాయడంతోపాటు అంతరిక్ష పరిశోధనల్లో స్పేస్ ఎక్స్ సత్తాచాటింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్(టెస్లా మోటార్స్ అధినేత) స్పేస్ ప్రయోగాల్లోకి అడుపెట్టారు.
అంతరిక్షంలో అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను పంపించాలనే ధ్యేయంతో పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ రాకతో అంతరిక్ష పరిశోధనల్లోనూ పోటీ తీవ్రతరం కానుంది. దీంతో రాబోయే రోజుల్లో శాటిలైట్ ప్రయోగాలు మరింత చౌకగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Falcon 9’s first stage has landed on the Of Course I Still Love You droneship pic.twitter.com/6gWWlLiXdG
— SpaceX (@SpaceX) January 24, 2021
0 Comments