స్టన్నింగ్ బ్యూటీ సంజన ఆనంద్.. కాకరేపుతోంది..!
- కోలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారుతున్న సంజన ఆనంద్
సంజన ఆనంద్ ఫొటోస్ (twitter/Sanjana Anand@itssanjanaanand)
సంజన ఆనంద్ కోలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. 1995 మార్చి 28న బెంగుళూరులోజన్మించిన సంజన ఆనంద్ చిన్నతనం నుంచి నటనపై ఆసక్తిని పెంచుకుంది. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన సంజన ఆనంద్ ఓ సాప్ట్ వేర్ కంపెనీలోనూ పని చేసింది.
కుందనపు బొమ్మలా ఉన్న సంజన్ ఆనంద్ తొలుత నోటా అనే షార్ట్ ఫిలీంలో నటించింది. ఇందులో సంజన ఆనంద్ చక్కటి నటన ప్రదర్శించడంతో ఆమెను వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు వచ్చాయి.
సంజన ఆనంద్ ఫొటోస్ (twitter/Sanjana Anand@itssanjanaanand)
|
సంజన ఆనంద్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమా రంగానికి పరిచయమైంది. 2019లో కెమెస్ట్రీ ఆఫ్ కరియప్ప అనే మూవీలో హీరోయిన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే మాలె బిల్లు మూవీలో నటించింది.
సంజన ఆనంద్ 2020 ఏడాదిలో కుష్క.. సాలగ.. షోకీవాలా సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు అధురి ప్రేమికుడు.. క్షత్రియ.. విండోసీటు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు హనీమూన్ అనే వెబ్ సిరీసులోనూ నటిస్తోంది.
సంజన ఆనంద్ ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తుండటం విశేషం. సంజన ఆనంద్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉంటూ తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.
Credit: © Copyright owner by respective creators
సంజన ఆనంద్ ఫొటోస్ (twitter/Sanjana Anand@itssanjanaanand)
|
Credit: © Copyright owner by respective creators
0 Comments