టక్ జగదీష్ టీజర్ అప్ డేట్ ఇచ్చిన నాని

talk Jagadish teaser talk, talk Jagadish movie, talk Jagadish updates, talk Jagadish trailer
నేచురల్ స్టార్ నాని తాజాగా శ్యామ్ సింగారాయ.. టక్ జగదీష్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలను నాని శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈక్రమంలో టక్ జగదీష్ మూవీకి సంబంధించి టీజర్ అప్ డేట్ ను హీరో నాని అభిమానులకు అందించారు. ఫిబ్రవరి 23న సాయంత్రం 5.04నిమిషాలకు టక్ జగదీష్ టీజర్ విడుదల చేయనున్నట్లు తన ట్వీటర్లో పోస్ట్ చేశాడు. 

నానితో ‘నిన్నుకోరి’ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటటైనర్ గా రాబోతున్న టక్ జగదీష్ మూవీలో నానికి జోడీగా రీతూవర్మ.. ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నాడు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. టక్ జగదీష్ మూవీని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలను చేస్తోంది.