కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటేనే టీకా..!
- వారంలో నాలుగు రోజులు కోవిడ్ టీకా పంపిణీ చేసేందుకు సన్నహాలు చేసిన తెలంగాణ సర్కార్.
COWIN Portalలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రతీఒక్కరూ కూడా ఈ కోవిన్ డిజిటల్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
కేంద్రం ఇప్పటికే కొవిషీల్డ్.. కోవ్యాక్సిన్ టీకాలకు అనుమతి ఇచ్చినందునా త్వరలోనే టీకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారం పదిరోజుల్లో టీకాల పంపిణీ కార్యక్రమం తెలంగాణలో మొదలు కాబోతుందనే ఆశాభావాన్ని శ్రీనివాసరావు వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ పంపిణీపై ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. టీకా పంపిణీపై ప్రజలందరూ సమచారాన్ని ఎప్పటికప్పుడు అందించనున్నట్లు తెలిపారు. కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికే ముందుగా టీకా వేయనున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వారంలో నాలుగు రోజులపాటు ప్రభుత్వ, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. బుధ.. శనివారాల్లో మాత్రం మిగతా టీకాల పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
రాబోయే గురు. శుక్రవారాల్లో 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైద్య సిబ్బంది ఇప్పటికే చేపట్టినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Also Read: కోవిడ్ టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం?
0 Comments