కోవిడ్ టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం?
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ముందే కేంద్రం అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించగా విజయవంతమైంది. నిన్ననే రెండు కోవిడ్ టీకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో వ్యాక్సిన్ పంపిణీ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సన్నహాలు చేస్తున్నాయి.
ఐదు దశల్లో వ్యాక్సిన్ పంపిణీ..
కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు దశల్లో పంపిణీ చేయనున్నాయి. తొలిదశలో వైద్యులు.. హెల్త్ కేర్ సిబ్బందికి.. రెండో దశలో పోలీస్..మున్సిపల్ కార్మికులు.. రక్షణ.. భ్రదత సిబ్బందికి, రెవిన్యూ తదితర సిబ్బందికి.. మూడో దశలో 60ఏళ్లు పైబడిన.. 50నుంచి 60ఏళ్ల మధ్య వయస్సున్న వారికి కేటగిరిలుగా విభజించి ఇస్తారు.
నాలుగో దశలో కరోనా ప్రభావిత ప్రాంతాలను భౌగిళికంగా గుర్తించి ఆ ప్రాంతంలోని వారికి కోవిడ్ టీకాను పంపిణీ చేస్తారు. ఇక ఐదో దశలో సాధారణ ప్రజలకు టీకాను అందుబాటులో ఉంచుతున్నారు. రాబోయే ఆరేడు నెలల్లో దేశవ్యాప్తంగా 30కోట్ల మందికి టీకాలను ఇచ్చేందుకు కేంద్రం సన్నహాలు చేస్తుంది.
వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
- సామాన్య ప్రజలు కోవిడ్ టీకాను పొందాలంటే ముందుగా ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- నేరుగా టీకా కేంద్రానికి వెళితే వ్యాక్సిన్ ఇవ్వరు.
- కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కోవిన్(COWIN) వెబ్ సైట్ లేదా యాప్ లో వివరాలను నమోదు చేసుకోవాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు లేదా ఆధార్ వివరాలను అప్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేశాక ఇందులో ఏ తేదిన.. ఎక్కడి రావాలి.. ఎన్ని గంటలకు రావాలి అనే వివరాలు వస్తాయి.
- COWIN డిజిటల్ వ్యవస్థ జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉండనుంది.
- COWIN యాప్ ఆండ్రాయిడ్.. యాపిల్ ఫోన్లలో అందుబాటులో ఉంది.
కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తారంటే..
- కోవిడ్ టీకాను ప్రభుత్వ.. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు వైద్యాధికారి అందుబాటులో ఉన్న నిర్ణీత ప్రాంతాల్లో టీకా కార్యక్రమం నిర్వహిస్తారు.
- పాఠశాలలు.. కళాశాలలు.. కమ్యూనిటీ హాల్స్ ను కూడా కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలుగా మారుస్తారు.
- మారుమూల గ్రామాల్లోని ప్రజలకు టీకాలను ఇచ్చేందుకు ప్రత్యేకంగా మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
- కొండలు.. గుట్టలు.. అటవీ ప్రాంతాల్లో నివసించే వారికైతే వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి టీకాలు వేయనున్నారు.
వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
- కోవిడ్ టీకా వేసేందుకు మూడు గదులున్న కేంద్రం ఉండాలి.
- మొదటి గది వెయింట్ రూమ్ కాగా.. రెండో గది డాక్టర్ టీకా ఇవ్వడానికి వినియోగిస్తారు.
- మూడో గదిలో కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి ఓ అరగంట వైద్యుల పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది.
- మొదటి డోస్ తీసుకున్న వ్యక్తి నాలుగు వారాల తర్వాత మళ్లీ అదే కంపెనీకి చెందిన రెండో డోస్ ఇస్తారు.
కోవిడ్ టీకా పంపిణీ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకున్నాయి. కేంద్రం అనుమతి వచ్చిన వెంటనే టీకా పంపిణీ షూరు కానుంది. ఇక ఇప్పటికే కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం 75లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సమాచారం.
Tags: Cowin Registration, Bharath Baitech, covaxin, covid vaccine india update, covid vaccine india news, covid vaccine india latest news, covid vaccine india company, Cowin, covid vaccine india when it will come, covid vaccine india available, covid vaccine india pricecovid 19 vaccine india latest update, covid, కోవిడ్ టీకా జాగ్రత్తలు..
0 Comments