విరుష్క కూతురు పేరుపై నెట్టింట్లో చర్చ..!
- పలు పేర్లను సూచిస్తున్న కోహ్లీ.. అనుష్క శర్మ అభిమానులు
Virat Kohli Anushka Sharma |
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి అనోన్య దాంపత్యానికి గుర్తుగా ఇటీవలే అనుష్క శర్మ ఓ కూతురుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.
అనుష్క శర్మ.. తన కూతురు క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ తమ ప్రైవసీని గౌరవించండి అంటూ కోహ్లీ అభిమానులను కోరాడు. విరుష్క దంపతులకు కూతురు జన్మించడంతో క్రికెట్ అభిమానులు.. సినీ అభిమానులు పెద్దసంఖ్యలో వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.
విరాట్ కోహ్లీ తన కూతురు పాదాల ఫొటోను ఇన్ స్ట్రాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. ఇదేక్రమంలో అభిమానులు కోహ్లీ కూతురు పేరుపై నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. విరుష్క దంపతులకు పలు పేర్లను సూచిస్తున్నారు. అందమైన పేర్లను సూచించడంతోపాటు వివరణలతో కామెంట్స్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు.
సెలబ్రెటీల జంటలు ఇద్దరు ఒకటైతే వారి పేర్లను కలిపి కొత్త పేరుతో పిలువడం ఇటీవలీ కాలంలో ఫ్యాషన్ గా మారింది. విరాట్.. అనుష్క శర్మ జోడీని ‘విరుష్క’గా.. సామ్-చైతు జోడీని చైసామ్ గా.. నిహారిక-చైతన్య జోడీని నిశ్చయ్ గా పిలుస్తున్నారు. అదేవిధంగా వారికి పుట్టిన బిడ్డల పేర్లను ఇలాగే పిలుస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్-స్నేహ దంపతుల కూతురు పేరును వీరిద్దరి పేర్లు కలిసేలా అర్హగా నామకరణం చేశారు. ఇదే తరహాలో ఇటీవలీ కాలంలో చాలామంది సెలబ్రెటీలు తమ సంతానానికి పేర్లు పెడుతున్నారు. అనుష్కశర్మ.. విరాట్ కోహ్లీలు కలిసి విరుష్కగా మారితే వారి కూతురు పేరును అనువిగా ఓ నెటిటన్ సూచించాడు.
అనువి అంటే అనుభవం అనే అర్థమని వివరించాడు. విరాట్ కూతురు సిడ్నీలో టెస్టును డ్రా చేసుకున్న రోజున పుట్టినందున ఆమెకు ‘సిడ్నీ’ పేరును పెట్టాలని ఓ నెటిజన్ సూచించాడు. గతంలో బ్రియన్ లారా సైతం తన కూతురుకు ‘సిడ్నీ’ పేరు పెట్టినట్లు గుర్తు చేశాడు. అలాగే సిడ్ని టెస్టులో విరోచితంగా పోరాడిన పూజారా.. రిషబ్.. విహారిలకు గుర్తుగా పురవి పేరు పెట్టాలని ఓ నెటిజన్ సూచించారు.
వీటితోపాటు అన్వి.. అన్విత.. వినుష్క.. ఇరుష్క.. విరుష్క వంటి పేర్లను అభిమానులు సూచిస్తున్నారు. అభిమానులు సూచిస్తున్న పేర్లన్నీ అందంగా ఉండటంతో వీటిలో విరుష్క దంపతులు ఏ పేరుకు ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విరుష్క దంపతులు మీడియాకు దూరంగా ప్రైవసీగా ఉంటూ సంతోషంగా గడుపుతున్నారు.
0 Comments