Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

sankranthi races in ap telangana cocks ready

 తెలంగాణ పందెం కోళ్లకు ఆంధ్రాలో ఫుల్ డిమాండ్..!

  • తెలంగాణ పోరాట పటిమను నలుదిశలా చాటుతున్న పందెం కోళ్లు..!

sankranthi races, telangana cocks ready, ap cocks, pandem kollu, padem, pandalu, kollapandalu
Telangana cocks ready

తెలంగాణ ప్రాంతానికి  ఉద్యమాల పురిటిగడ్డ అని పేరుంది. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో ఉద్యమాలకు తెలంగాణ కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజల పోరాటం ఎన్నటికీ మరిచిపోలేనిది. సమైక్యవాదులు ఎత్తులను చిత్తులుచేసి ఎన్నో ఏళ్ల స్వరాష్ట్ర కలను తెలంగాణవాసులు నిజం చేసుకున్నారు. 

ఉద్యమాలు.. పోరాటాలు చేయడంలో ఆంధ్రావాళ్లతో పోలిస్తే తెలంగాణ వాళ్లే చాలా ముందుంటారు. పట్టినపట్టు వదలకుండా ముందుకు దూసుకెళుతుంటారు. ఈ నేలకు ఉన్న పవరే తెల్సిన వాళ్లంతా ఇక్కడివాళ్ల గురించి చెప్పుకోవడం చూస్తూనే ఉంటాం. తెలంగాణ పౌరుషాన్ని మన కోళ్లు కూడా నలుదిశలా చాటుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ప్రతీయేటా వైభవంగా జరుగుతుంటాయి. సంక్రాంతి నాడు పోలీసుల నిఘా ఎంత ఉన్నప్పటికీ సిక్రెట్ గా పందాలు కాయడం చూస్తుంటారు. ప్రముఖులు సైతం ఈ పందెల్లో పాల్గొంటుండటంతో పోలీసులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తుంటారు. 

సంక్రాంతి నిర్వహించే పందాల్లో వందల కోట్లు చేతులు మారుతుంటాయి. ఆంధ్రాలోని ఉభయ గోదావరి జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి.. అశ్వారావుపేట.. మధిర.. ఎర్రుపాలెంలోని వ్యవసాయ క్షేత్రాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించేందుకు పందెంరాయుళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగ రోజుల్లో కోడిపందెల జోరుగా కొనసాగనుంది. కోడి పందెల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పందాలు కాసేందుకు.. చూసేందుకు భారీగా జనాలు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని బడా కాంట్రాక్టర్లు.. వ్యాపారులు.. ఎంపీ.. ఎమ్మెల్యే స్థాయి నాయకులు.. సెలబ్రెటీలు పాల్గొంటూ ఉంటారు. 

కోడి పందెల్లో లక్షల్లో డబ్బులు దక్కంచుకోగా అంతే భారీగా నగదు పొగొట్టుకోవడం వంటి సంఘటనలు అనేకం కన్పిస్తుంటాయి. కోడిపందెల కోసం ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎకరాల కొత్త స్థలాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు. గతంలో కేవలం ఆంధ్రాకే పరిమితమైన కోడి పందెలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 

సంక్రాంతి పండగకు వారం.. పది రోజులు ముందుగానే నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఆంధ్రాలో జరిగే కోడిపందెల్లో తెలంగాణ కోళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి కోళ్ల పోరాట పటిమ కారణంగా తెలంగాణ కోళ్లకు భారీ డిమాండ్ ఉంది. వనపర్తి జిల్లాలోని వీపనగుండ్ల పందెం కోళ్లకు ప్రసిద్ధి. 

వనపర్తితోపాటు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలోనూ పందెం కోళ్లను కేవలం సంక్రాంతి వేడుకల కోసం తయారు చేస్తుంటారు. ఒక్కో పందెం కోడి విలువ 30వేల నుంచి లక్షల్లో పలుకుతూ ఉంటుంది. వీటిని మూడునెలల తర్ఫీదును నిర్వహాకులు ఇస్తుంటారు. ఇక్కడి కోళ్లను కొనుగోలు చేసేందుకు పందెంరాయుళ్లు భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. 

ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే పందాల నిర్వాహణపై నిఘా పెంచారు. మంగళవారం కొన్ని ఏరియాల్లో పోలీసులు దాడులు చేుసి నిర్వహాకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి రాజకీయ నాయకుల సపోర్టు ఉందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా తెలంగాణ కోళ్లు ఆంధ్రాలో సత్తాచాటుతుండటం విశేషం. 


Also Read: సంక్రాంతి రోజున అల్లుడు అత్తగారింటికి ఎందుకెళ్లాలంటే?

Also Read: ఆ పండుగ.. మగవాళ్లకు మాత్రమే..!

Post a Comment

0 Comments