భయం వేసింది.. అయినా ధైర్యం చేశాను..!
హీరోయిన్ నందితా శ్వేత తాజాగా నటించిన చిత్రం ‘అక్షర’. నందితా శ్వేత టాలీవుడ్లో ‘ప్రేమ కథా చిత్రమ్-2’.. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటి హర్రర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘అక్షర’ మూవీ ఇటీవలే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
నందితా శ్వేత ‘అక్షర’ మూవీలో లీడ్ రోల్ చేస్తుండగా దర్శకుడు బి.చిన్నికృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సురేష్ వర్మ అల్లూరి.. అహితేజ బెల్లంకొండ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నందితా శ్వేత ‘అక్షర’ మూవీపై స్పందించారు.
హర్రర్ మూవీలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తనకు ‘అక్షర’ మూవీ ఒక చేంజ్ ఓవర్ మూవీ మారబోతుందని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో లేడి ఓరియేంటేడ్ పాత్రల్లో నటించడం సాహసమేనని అన్నారు. ఈ కథ విన్నప్పుడు కొంచెం భయం వేసంది.. అయితే ధైర్యం చేసి నటించానని నందితా శ్వేత తెలిపారు.
‘అక్షర’ మూవీ తన అభిమానులకు నచ్చుతుందనే ధీమాను నందితా శ్వేత వ్యక్తం చేసింది. అదేవిధంగా తనకు టాలీవుడ్లో తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ‘రాజుగారి గది-2’ ఫేమ్ అశ్విత్ తో ఓ మూవీ చేస్తున్నట్లు తెలిపింది.
0 Comments