నేలమాళిగల్లో అద్భుత కట్టడం ఎక్కడో తెలుసా?
కన్ స్ట్రక్షన్ రంగంలో చైనా ఎంతో పురోగతి సాధించింది. పెద్దపెద్ద కట్టడాలను సైతం చైనా ఎంతో సులభంగా కట్టడుతూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాల్లో చైనాలో ఉన్నాయి.
నేటి సాంకేతికను వినియోగించుకుంటూ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కట్టడాలను చైనా గత వందేళ్లలో ఎన్నో నిర్మించింది. నింగి.. నేలపై ఎన్నో సత్తాచాటిన చైనా నేలమాళిగల్లోనూ ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించింది.
చైనాలోని మెట్రో నగరాల్లో షాంఘై ఒకటి. చైనాలో అత్యధికంగా జనాభా షాంఘైలోని నివసిస్తుంటారు. ఈ సిటీకి గంట ప్రయాణ దూరంలో షెంకెంగ్ క్వారీ ఉంది. ఈ క్వారీనే చైనీయులు అద్భుతమైన కట్టడంగా తీర్చిదిద్దారు.
క్వారీల కోసం ఉపయోగించిన స్థలాన్ని చాలావరకు వృథాగా వదిలేస్తుంటారు. కానీ చైనీయులు మాత్రం దానిని వృథాగా వదిలేకుండా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఆ ప్రాంతంలో 17 అంతస్థుల హోటల్ భవనాన్ని నిర్మించి అందరి మన్నలను పొందుతున్నారు.
భూమి నుంచి లోపలికి 88మీటర్ల వరకు 17 అంతస్థులను నిర్మించారు. ఈ హోటల్ కు ఒకవైపు నేలను ఆనుకొని ఉంటుంది. మరోవైపు చూడచక్కని వాటర్ ఫాల్ ఉంటుంది. నీటి దిగువ మరో లగ్జరీ సూట్ నిర్మించారు.
ఈ సూట్స్ లోకి వెళ్లిన తరువాత కిటికిల్లోంచి చూస్తే.. పెద్దపెద్ద చేపల ట్యాంకులు కనువిందు చేస్తాయి. దీనిని చూస్తే సముద్రంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ హోటల్లో ఓ థీమ్ పార్కు ఉంది. రాక్ క్లైంబింగ్ వంటి ఎడ్వంచర్స్ కూడా చేయవచ్చు.
ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ ల్యాండ్ గా పిలిచే ఈ హోటల్ కు నిర్మాణానికి 288మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయాట. ఈ హోటల్ గదిలో ఒక రాత్రి బస చేస్తే 3394యువాన్లు లేదా 490డాలర్లు ఖర్చు అవుతుంది.
విలాసాలు కోరుకునేవారు ఇక్కడికి వెళ్లి ఎంచక్క ఎంజాయ్ చేయచ్చు. కాగా 2013లో చైనాలో ఓ వర్షం కురియగా ఈ కట్టడం సగం నీళ్లలోనే మునిగిపోయింది. అయితే కట్టడం పూర్తయ్యాక భారీ వర్షం పడితే తమ కష్టం వృథా అయ్యేదని ఇంజనీర్లు చెబుతున్నారు.
చైనాలో నేలమాళిగల్లో నిర్మించిన కట్టడం ఇదే తొలిసారి కావడంతో దీని కోసం ఉపయోగించిన సాంకేతిక అంతా కొత్తదేనని తెలుస్తోంది. చైనా ఇంజనీర్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ కట్టడాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
Tags: Shanghai Luxury hotel, Luxury hotel in china, 17 floor luxury hotel, China hotel in pitfall, pitfall hotel, China Wonder land, Chine une carrier reconvertie en hotel, ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ ల్యాండ్.
0 Comments