చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. ఈ పండు తినాల్సిందే..!
- కివీ పండులో బోలెడన్నీ పోషకాలు శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని అందించడంలో తోడ్పడుతాయి.
కార్తీక మాసం వస్తూనే చలిని వెంటబెట్టుకొని వచ్చేసింది. భారతదేశంలో చలికాలం 2020 డిసెంబర్ 21(సోమవారం) నుంచి మొదలై 2021 మార్చి ఉండనుంది 20(శనివారం) వరకు . దీంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంది.
మరో మూడునెలలపాటు చలికాలం ఉండనుంది. జనవరి.. ఫిబ్రవరి నెలలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఉదయం 10గంటల వరకు వాతావరణం చలిగానే ఉంటోంది.
చలిలో వెచ్చదనం కోసం కివీ పండు..
చలికాలంలో శరీరాన్ని వీలైనంత వరకు వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం శరీరానికి వేడినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
చలికాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు.. చర్మం పగుళ్లు.. జీర్ణక్రియ సరిగా జరుగకపోవడం.. మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కీవీ పండు దివ్యౌషధంగా పని చేయనుంది.
కివీలోని అద్భుతమైన పోషకాలు..ఉపయోగాలు..
- కివీ పండ్లలో విటమిన్ సీ అత్యధికంగా ఉండటం చలికాలంలో దీనిని ఆహారంగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కివీ పండ్లు తినడం ద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. చర్మం సురక్షితంగా.. పగలకుండా ఉంటుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
- కివీ పండ్ల పేస్టును ఫేస్ ప్యాక్‌లా చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది మంచి ఫైబర్ గల ఆహారం. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. లుటెయిన్.. ప్రోస్టేట్ గ్రంధి.. కాలేయ క్యాన్సర్లను నిరోధించును.
- మనోవ్యాకులత చికిత్సకు పని చేస్తుంది. కంటిచూపు సమస్యలను నివారిస్తుంది. కివీ పండ్లోని ప్రోటీన్ వల్ల కొంతమందిలో ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
- కివీ పండును వండర్ ఫ్రూట్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పీచు పదార్థం.. విటమిన్ ఇ.. పొటాషియం.. ఫోలిక్ యాసిడ్.. కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలకు కివీ పెట్టింది పేరుగా నిలుస్తుంది.
- న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీ పండు ప్రస్తుతం మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. ఈ పండులో కొవ్వులు.. సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
- బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ వల్ల బీపీ.. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. కివీ పండులో అద్భుతమైన పోషకాలే కాకుండా నోరూరించే రుచి దీని సొంతం.
0 Comments