‘చావుకబురు చల్లగా’ ఫన్నీ టీజర్ ట్రెండింగ్
![]() |
Chaavu Kaburu Challaga Teaser |
ఆర్ఎక్స్-100 హీరో కార్తీకేయ.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా..!’. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు పెగళ్లపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వేసవిలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది.
‘చావు కబురు చల్లగా’ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టిజర్ గిమ్స్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 50సెకన్ల నిడివితో రిలీజైన చావుకబురు చల్లగా ఫన్నీ గిమ్స్ ను సంక్రాంతి కానుకగా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ గిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
కార్తీకేయ.. లావణ్య త్రిపాఠి మధ్య ఫన్నీ సీన్స్ టీజర్లో ఆకట్టుకున్నాయి.. ‘నువ్వు ఈ ఆసుపత్రికి సిస్టర్ వటగా.. మంచి ఉద్యోగమే ఎతుక్కున్నావ్.. మనం ప్రేమించే అమ్మాయి మనకు తప్పా మిగతా వాళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో.. సూపర్ ఏహే’ అని కార్తికేయ చెబుతాడు.
దీనికి లావణ్య త్రిపాఠి ‘నాలుగు పీకీ ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ నే అవుతా’నంటూ బదులిస్తుంది.. ఈ మూవీలో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజుగా.. లావణ్య త్రిపాఠి మల్లిక అనే నర్స్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Manam preminchina ammai manak thappa migilinolandarki sister ane peeling edaithe undo..#CKCTeaserGlimpse ▶️ https://t.co/em2lnMmAGu
— Kartikeya (@ActorKartikeya) January 11, 2021
A Summer 2021 Release 🤩#AlluAravind @Itslavanya @Koushik_psk #BunnyVas @JxBe #KarmChawla #SatyaG @GA2Official #ChaavuKaburuChallaga
0 Comments