సంక్రాంతి ముందే ‘అల్లుడు’ స్టాటజీ వర్కౌటయ్యేనా?
- ఒకరోజు ముందుగానే థియేటర్లలో సందడి చేయనున్న ‘అల్లుడు అదుర్స్’
Alludu Adhurs |
లాక్డౌన్ ఎఫెక్ట్ తో సినిమా రంగం కుదేలైంది. థియేటర్ల గత తొమ్మిదినెలలుగా మూతపడటంతో ఆ రంగంపై ఆదారపడిన వారంతా ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం థియేటర్ల ఓపెనింగ్ అనుమతి ఇచ్చినా కరోనా నిబంధనలు కఠినంగా ఉండటంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
50శాతం అక్సుపెన్సీ.. కరోనా నిబంధనలు పాటించడం ద్వారా తమకు నిర్వహణ భారం అధికమవుతుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో కొత్త సినిమాల సందడి షూరు అయింది. ఇప్పటిదాకా ఓటీటీలకే పరిమితమైన సినిమాలన్నీ కూడా థియేటర్ల బాటపడుతున్నాయి.
రవితేజ నటించిన క్రాక్ నిన్ననే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి రేసులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ మూవీ.. రామ్ పోతినేని నటించిన ‘రెడ్’.. తమిళ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీలు ఉన్నాయి. ‘మాస్టర్’ మూవీ జనవరి 13న.. ‘రెడ్’ మూవీ జనవరి 14న.. ‘అల్లుడు అదుర్స్’ మూవీ జనవరి 15న విడుదల కానున్నాయి.
‘అల్లుడు అదుర్స్’ అనుకున్న టైం కంటే ఒకరోజు ముందుకు జరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా ఆడియో ఫంక్షన్లో అధికారికంగా ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అదేరోజు రామ్ ‘రెడ్’ మూవీ రిలీజ్ కానుండటంతో ఆ సినిమా నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది.
ప్రొడ్యూసర్ గిల్డ్ ముందుకు రిలీజ్ డేట్ పంచాయితీ వెళ్లిందని సమాచారం. అసలే 50శాతం అక్సుపెన్సీతో సినిమాలు నడుస్తుండగా సినిమా మధ్య పోటీ నెలకొంటే కలెక్షన్ల తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
సంక్రాంతి రోజునే ‘అల్లుడు’ పంచాయితీ టాలీవుడ్లో టాక్ ఆఫ్ టౌన్ గా నిలిచింది. అల్లుడు అనుకున్న టైం కంటే ముందు వస్తాడా? లేదంటే లేటుగా వస్తాడా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
0 Comments