Header Ads Widget

Breaks for weddings in 2021 Until then

2021లో పెళ్లిళ్లకు బ్రేక్ వేసిన ముహుర్తాలు.. ఎప్పటి వరకు అంటే?

  • జనవరి 8 దాటితే.. ఆగస్టు 11వరకు మంచి ముహుర్తాలు లేవంటున్న పండితులు..!

useintrend

2020 ఏడాదంతా కరోనాతో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో కేంద్రం మార్చిలో లాక్డౌన్ విధించింది. దీంతో పెళ్లిళ్లకు సిద్ధమైన జంటలు వాయిదా వేసుకున్నాయి. లాక్డౌన్ తర్వాత కరోనా నిబంధనలు పాటిస్తూ తుతూమంత్రంగా పెళ్లిళ్లు చేసుకున్నారు. 

జీవితంలో పెళ్లి అనేది ఓ అరుదైన ఘట్టం. ఆ వేడుక జీవితాంతం గుర్తుండిపోవాలని భావించినవాళ్లు మాత్రం పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కొంతమంది మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్నారు. 2020లో పెళ్లిళ్లు కరోనా కారణంగా వాయిదాపడగా 2021లో సరైన ముహుర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడేలా కన్పిస్తున్నాయి. 

కొత్త ఆశలతో 2021 సంవత్సరంలోకి అడుగుపెట్టిన పెళ్లికాని ప్రసాద్ లు.. పెళ్లీడు యువతులకు ముహుర్తాలు బెంబేలెత్తిస్తున్నాయి. జనవరి 8తేది వరకే మంచి ముహుస్తాలు ఉన్నాయని చెబుతున్నా.. 7వవ తేదినే చివరి ముహుర్తమంటూ పండితులు చెబుతున్నారు. ఇక మే 14న ముహుర్తం ఉండగా అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. 

అయితే జూన్ 4నుంచి ఆషాడం మొదలు కానుంది. ఆగస్టు 11తేదితో ఆషాడం ముగియనుంది. దీంతో అప్పటివరకు ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచిరోజులు కావని పండితులు చెబుతున్నప్పటికీ శాస్త్రీయంగా మాత్రం వీటికి ఆధారాలు లేకపోవడం గమనార్హం. 

2021ఫిబ్రవరి 14 తేదీ మాఘ శుద్ధ తదియ నుంచి మే 4 బహుళ అష్టమి వరకు సుమారు 80రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభం అయినా పదిరోజులుపాటు బలమైన ముహూర్తాలు లేవంటున్నారు. ఇక మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. 

అయితే జూలై 4నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. దీంతో 2021లో బలమైన ముహూర్తాల కొరత అధికంగా ఉందని పండితులు చెబుతున్నారు. ఇన్నాళ్లు కరోనాతో ఇబ్బందులు పడిన పెళ్లీడు యువతీ యువకులు 2021లో సరైన ముహుర్తాల్లేక నిరుత్సాహానికి గురవుతున్నారు.

Tags: Wedding images, Wedding images-2021, Wedding Stills, Wedding wishes, calendar, Long Break, May month,, priests, wedding moments, Marriage quotes in english, Marriage Quotes in Telugu, Love marriage quotes in telugu, Marriage day Quotes, Wedding wishes, Wedding anniversary wishes.

Post a Comment

0 Comments